లక్ష్మీపార్వతికి గౌరవ ఆచార్య హోదా ఉపసంహరణ
posted on Aug 2, 2024 10:08AM
వైసీపీ హయాంలో లక్ష్మీపార్వతికి లభించిన హోదాలు, బాధ్యతలను ఆంధ్రావర్సిటీ ఇప్పుడు తొలగిం చింది. వైపీపీ అధికార ప్రతినిథి, తెలుగు అకాడమీ మాజీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతికి ఆంధ్రావర్శిటీ ఇచ్చిన గౌరవ ఆచార్య హోదాను ఉపసంహరించుకుంది.
ఈ మేరకు ఆంధ్రా యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఓ ప్రకటనలో తెలిపారు. గౌరవ ఆచార్య హోదాలో లక్ష్మీపార్వతికి ఇంత వరకూ ఎటువంటి వేతనం చెల్లించలేదని ఆయన తెలిపారు. కాగా వైసీపీ హయాంలో ఆమెను తెలుగు అకాడమీ చైర్ పర్సన్ గా నియమించిన సంగతి తెలిసిందే.
దాంతో పాటు ఏయూలో గౌరవ ఆచార్య హోదాతో పాటు విశ్వ విద్యాలయ పరిశోధకులకు మార్గదర్శనం వహించే బాధ్యత కూడా అప్పగించారు. ఇప్పుడు గౌరవ ఆచార్య హోదా ఉపసంహరించడంతో పాటు, పీహెచ్ డీ స్టూడెంట్స్ కు మార్గదర్శకురాలిగా వ్యవహరించే బాధ్యత నుంచి కూడా తప్పించారు.