దెందులూరులో మరోసారి వైసిపి గుండాల అరాచకం
posted on May 3, 2024 11:01AM
దెందులూరు లో టిడిపి అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ ఎన్నికల ప్రచారంలో అపశృతి చోటు చేసుకుంది. టిడిపి నాయకులపై వైసీపీ గుండాలు హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఐరెన్ రాడ్లతో ఒక్కసారిగా వైసిపి గుండాలు దాడి చేశారు. ఎన్నికలకు గడువు సమీపించడంతో వైసీపీ కార్యకర్తలు , నాయకుల్లో సహనం నశించి పోయింది. వారిలో రాక్షసత్వం ఒక్కసారిగా పెల్లుబికింది. ఈ దాడిలో పలువురు టిడిపి నాయకులు రక్త సిక్తమయ్యారు. ఒక టిడిపి నాయకుడి తల పగల గొట్టారు. అతని పరిస్థితి ఆందోళన కరంగా ఉంది. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి బాధితుడిని తరలించారు. వైసిపి దాడికి నిరసనగా విజయరాయి గ్రామంలో రోడ్డుపై చింతమనేని ప్రభాకర్ ధర్నా నిర్వహించారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని నిందితులపై తక్షణమే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను చింతమనేని ప్రభాకర్ పరామర్శించి వైద్య సేవలను మరింత మమ్మురం చేయాలని అధికారులను డిమాండ్ చేశారు.