నవంబర్ తుపాను: గడగడలాడుతున్న ఏపీ.!
Published on: Wed Nov 18, 2026 10:39AM

నవంబర్ నెలలో తుపాను అంటే చాలు ఆంధ్రప్రదేశ్ వణికి పోతుంది. రాష్ట్ర చరిత్రలో నవంబర్ లో బంగాళాఖాతంలో తుపాను ఏర్పడిందన్న వార్త వింటే ఆంధ్రప్రజలకు దివిసీమ, కోనసీమ ఉప్పెనలే గుర్తుకు వవస్తాయి. 1977 నవంబర్ 19న దివిసీమ ఉప్పెన, 1996 నవంబర్ 6న కోనసీమ ఉప్పెన లు రాష్ట్ర తీర ప్రాంతాలను అతలాకుతలం చేశాయి. వందలాది ప్రాణాలను హరించాయి. ఊళ్లకు ఊళ్లు తుడిచిపెట్టుకు పోయాయి.
1977 నవంబర్ 19న పెను తుపాను దివిసీమను శవాల దిబ్బగా మార్చేసింది. తుపానుతీరం దాటే సమయంలో200 కిలీమీటర్ల వేగాన్ని మించి వీచిన పెనుగాలలకు సముదరం చెలియల కట్ట తెంచుకుని విరుచుకుపడింది. ఏడు మీటర్ల ఎత్తున ఎగసి జనావాసాలపై పడిన రాకాసి సముదరపు అలలు కనీసం పది వేల మంది ప్రాణాలను కబలించాయి.
ఇది అధికారిక సంఖ్య మాత్రమే.. వాస్తవంగా మృతుల సంఖ్య ఇంకా భారీగా ఉంటుందని అప్పట్లోనే పలు నివేదికలు పేర్కొన్నాయి. ఇక ఆస్తినష్టం అయితే చెప్పడానికి వల్లకానంత భారీగా ఉంది. కోడూరు, నాగాయలంక మండలాల్లోని పలు గ్రామాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
.webp)
ఇక ఇదే 1996లో ఇదే నవంబర్ నెలలో 6వ తేదీన పెనుతుపాను కొనసీమను చిగురుటాకులా వణికించింది. కాకినాడ, యానాం మధ్య తీరం దాటిన ఈ తుపాను ప్రభావం కోనసీమపై అత్యంత తీవ్రంగా ఉంది. తుపాను తీరం దాటే సమయంలో 200 కిలోమీటర్లకు పెబడిన వేగంతో వీచిన పెనుగాలులకు సముద్రపుటలలు ఉవ్వెత్తున ఎగసి పడి ఉప్పెనగా మారి గ్రామాలకు గ్రామాలను తుడిచిపెట్టేశాయి. ఈ ఉప్పెన కారణంగా దాదాపు 2000 వేల మంది మరణించిన ఉంటారు. తీర ప్రాంత గ్రామలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వేలాది ఇళ్లు, వరి పొలాలు, కొబ్బది తోటలు నేలకొరిగాయి.
ఇది కూడా చదవండి: నవంబర్ 19.. చరిత్రలో చేదు జ్ఞాపకం.. దివిసీమ ఉప్పెన మానని గాయం..
ఇప్పుడు తాజాగా నవంబర్ నెలలోనే పెను తీవ్ర తుపాను అక్వాన్ ఏపీ తీరాన్ని తాకనుందన్న వాతావరణ శాఖ హెచ్చరికతో ఏపీ తీర ప్రాంత గ్రామాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. పైగా ఈ తుపాను ప్రభావంతో ఉప్పెన సంభవించే అవకాశం ఉందన్న హెచ్చరికలతో వారు ప్రాణాలు అరచేతుల్లోపెట్టుకుని గడుపుతున్నారు. అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన తీర ప్రాంత గ్రామాలను ఖాళీ చేయించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నప్పటికీ.. నాటి ఉప్పెనల జ్ణాపకాలు ప్రజల వెన్నులో చలిపుట్టిస్తున్నాయి.

1996 కోనసీమ ఉప్పెన కారణంగా అమలాపురం,ఉప్పలగుప్తం,కాట్రేనికోన,అయినవిల్లి ,ముమ్మడివరం,కొత్తపేట, పి.గన్నవరం వంటి ప్రాంతాలలో అతి భారీగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వాటిల్లింది.
మీకు నచ్చవచ్చు: ఆంధ్రప్రదేశ్.. 55 ఏళ్లలో 61 తీవ్ర తుపానులు!
కోనసీమకు ఉప్పెన ముప్పు: మహోగ్రంగా దూసుకొస్తున్న ఆక్వాన్.!
[APTycoons, Uppena, Divieema, Konaseema, Heavytides, Heavyloss, Deaths, TeluguOne]


