TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు: ప్రారంభమైన కౌంటింగ్.!

Published on: Sat Nov 7, 2026 7:18AM

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు శనివారం (నవంబర్ 7) ఆరంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తున్నారు. ఆ తరువాత బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తారు.   ప్రతి బాక్సులోని  ఎంపీటీసీ బ్యాలట్‌  బ్యాలెట్ పత్రాలు,   జడ్పీటీసీ బ్యాలట్‌ పత్రాలను వేరు చేస్తారు. అన్ని పోలింగ్‌ కేంద్రాల బ్యాలట్లను కట్టలుగా కట్టి రిటర్నింగ్‌ అధికారి టేబుల్‌ దగ్గర ఏర్పాటు చేసిన డ్రమ్ములో వేసి కలుపుతారు. ఒక్కో టేబుల్‌కు ప్రతి విడతలో పాతిక బ్యాలట్‌ పత్రాల చొప్పున 40 కట్టల్లో మొత్తం వెయ్యి బ్యాలట్‌ పత్రాలు అందజేయనున్నారు.

మెుత్తం 365   కేంద్రాల్లో  ఓట్ల లెక్కింపు చేపట్టారు. కౌంటింగ్ ప్రారంభమవుతోంది. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పరిషత్ ఎన్నికల కౌంటింగ్ పూర్తి చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది.  కాగా తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం ధుమంతునిగూడెంలో విషాదం చోటు చేసుకుంది. జనసేన ఎంపీటీసీ అభ్యర్థి గారపాటి దివ్య  శుక్రవారం నవంబర్ 6 మరణించారు. సరిగ్గా ఫలితాలు వెలువడడానికి ఒక్క రుజు ముందు ఆమె మరణించడంతో గ్రామంలో విషాద చ్ఛాయలు అలుముకున్నాయి.  

ఇకపోతే పరిషత్ ఓట్ల లెక్కింపునకు రాష్ట్ర ఎన్నికల సంఘం పటిష్ఠ ఏర్పాట్లు చేసింది. ఓట్ల లెక్కింపునకు 30 వేల మందికి పైగా సిబ్బందిని నియోగించింది. లెక్కింపు కేంద్రాలన్నిటిలోనూ సీసీ కెమేరాలు ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 9 వేలకుపైగా కౌంటింగ్ టేబుల్స్‌ సిద్ధం చేశారు. స్ట్రాంగ్‌ రూమ్‌ల్లో భద్రపరిచిన బ్యాలెట్ బాక్సుల్ని ఉదయాన్నే కౌంటింగ్ కేంద్రాలకు తరలించింది అదలా ఉంటే  582 జట్పీడీసీలు, 7767 ఎంపీటీసీలు ఏకగ్రీవం అయ్యాయి.  ఇక పోతే ఎన్నికల సంఘం అంచనాల ప్రకారం మధ్యాహ్నం మూడు గంటల వరకూ కౌంటింగ్ పూర్తి అవుతుంది. రాత్రి ఎనిమిది గంటలకల్లా ఫలితాలు వెల్లడయ్యే అవకాశాలున్నాయి.  

 గురువారం జరిగిన పరిషత్ ఎన్నికల పోలింగ్ లో 72.72శాతం పోలింగ్ జరిగింది ఎంపీటీసీ ఎన్నికలకు గులాబీ రంగు, జడ్పీటీసీ ఎన్నికలకు తెలుపు రంగు బ్యాలెట్ పేపర్లను ఉపయోగించారు. వర్షాలు, వరదల కారణంగా 5 మండలాల్లో, సాంకేతిక సమస్యల వల్ల మరికొన్ని చోట్ల రీపోలింగ్ అవసరమైంది. ఆ రీపోలింగ్ కూడా శుక్రవారం (నవంబర్ 6) ప్రశాంతంగా ముగిసింది. ఇక పోలింగ్ విషయానికి వస్తే విశాఖపట్నం జిల్లాలో  అత్యధికంగా  82.51 శాతం, అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యల్పంగా సుమారు 62.01 శాతం పోలింగ్ జరిగింది.  

ఇది కూడా చదవండి: ఏపీ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల: మూడు దశల్లో పోలింగ్.!

28 జిల్లాల్లో 365 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 9,000కు పైగా టేబుళ్లు సిద్ధం చేశారు. 30 వేల  ల మంది సిబ్బంది విధుల్లో పాల్గొంటారు. వీరిలో 11 వేలకు పైగా సూపర్‌వైజర్లు ఉన్నారు. కేంద్రాల వద్ద సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు.  రాష్ట్రంలో జిల్లా, మండల పరిషత్‌ ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా సాగేందుకు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఐజీ రాజకుమారి తెలిపారు. 

మొత్తం 365 కౌంటింగ్‌ కేంద్రాల్లో మూడంచెల భద్రతా వ్యవస్థ ఉంటుందని.. 19,885 మంది పోలీసు సిబ్బందిని మోహరించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టారు. సీసీటీవీ కెమెరాలు, డ్రోన్‌ నిఘాతో పాటు పోలీసు సిబ్బంది ధరించే బాడీవోర్న్‌ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ చేపట్టనున్నారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద భద్రతను నిరంతరం పర్యవేక్షించేలా ముందస్తు చర్యలన్నీ తీసుకున్నట్లు ఐజీ వెల్లడించారు.

మీకు నచ్చవచ్చు:  పులివెందులలోనూ వైసీపీ కుదేలు: రాజకీయం పతనానికి సంకేతమేనా?

మునిసిపోల్స్ లో ఘోర పరాజయం: అంబటి నోట పరాజయం మాట: ఓటమి ఒప్పుకోలు.!​

 

[AP Parishad Votes Counting Started,   AP Local Body Counting, ZPTC MPTC Vote Counting, Postal Ballots, TeluguOne]