TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

ఏపీ పంచాయతీ పోలింగ్ ప్రారంభం: భారీగా తరలివస్తున్న ఓటర్లు.!

Published on: Thu Nov 26, 2026 8:25AM

ఆంధ్రప్రదేశ్‌లో  తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలతో పాటు మలి విడత పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ గురువారం (నవంబర్ 26) ఉదయం  ప్రారంభమైంది. మొత్తం 3,240 గ్రామ పంచాయతీలు, 23 పట్టణ స్థానిక సంస్థల పరిధిలో ఓటింగ్ జరుగుతోంది. 

ఎన్నికల కమిషన్, జిల్లా యంత్రాంగాలు పోలింగ్‌ను ప్రశాంతంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు  చేశాయి. ఈ ఎన్నికల కోసం రాష్ట్రవ్యాప్తంగా   34,312 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, 99,43,895 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.  

గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచ్‌, వార్డు సభ్యుల పదవులకు పోటీ హోరాహోరీగా ఉంది. ఏకగ్రీవంగా ఎన్నికైన స్థానాలను మినహాయిస్తే.. 3,189 సర్పంచ్‌ స్థానాలు,  25,101 వార్డు సభ్యుల స్థానాలకు కలిపి మొత్తం 62,863 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

మరోవైపు పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అభ్యర్థుల మధ్య గట్టి పోటీ కనిపిస్తోంది. శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, కాకినాడ, మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థల్లో మేయర్‌ పదవులకు, అలాగే మరో 19 పురపాలక సంఘాలు,  నగర పంచాయతీల్లో ఛైర్‌పర్సన్‌ పదవులకు కలిపి 170 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 

ఇది కూడా చదవండి: ఏపీలో రెండో విడత పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల..పూర్తి షెడ్యూల్ ఇదే.!

వీరిలో మేయర్‌ స్థానాలకు 36 మంది, ఛైర్‌పర్సన్‌ స్థానాలకు 134 మంది బరిలో ఉన్నారు. వీటి పరిధిలోని మొత్తం 964 డివిజన్లు, వార్డుల్లో 2,968 మంది   పోటీలో ఉన్నారు. పోలింగ్ కు ఓటర్లు ఉదయం నుంచే పెద్ద ఎత్తున బారులు తీరడం కనిపించింది.  

ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం భూదేవిపేటలో ఉదయం 6.30 గంటలకే పెద్ద సంఖ్యలో ఒటర్లు పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకున్నారు.  అలాగే  టి.నర్సాపురంలోనూ, ఉమ్మడి కర్నూలు జిల్లాలోని గోస్పాడు, హాలహర్వి ప్రాంతాల్లోనూ పోలింగ్ ప్రారంభ సమయం కంటే ముందు నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు.  

మీకు నచ్చవచ్చు:  ఏపీలో రేపే తొలి విడత పంచాయతీ పోలింగ్..ఎన్నికలకు సర్వం సిద్ధం.!​

ఏపీలో మోగిన స్థానిక సమర భేరి.. మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు.!

[AP Panchayat Elections,  AndhraPradesh Local Body Polls, Sarpanch,  Ward members, TeluguOne]