TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఏపీలో మళ్లీ ఎన్నికల రణం: ఈ నెలలోనేపెండింగ్ మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికలు.!

Published on: Fri Nov 6, 2026 8:15AM

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల రణం మళ్లీ మొదలవ్వనుంది.   రాష్ట్రంలో వివిధ కారణాల వల్ల నిలిచిపోయిన   పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ దిశగా రాష్ట్ర ఎన్నికల సంఘం చురుగ్గా అడుగులు వేస్తోంది.   పరిస్థితులు అనుకూలిస్తే ఈ నెల రెండో వారంలోనే  ఈ ఎన్నికలకు   నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.  

విశ్వసనీయ  సమాచారం మేరకు, ఈ విడతలో మొత్తం 23 మునిసిపాలిటీలు, కార్పొరేషన్ లకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది.   వీటిలో  4 మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు  19 మున్సిపాలిటీలు నగర పంచాయతీలు ఉన్నాయి. గతంలో కొన్ని కారణాల వల్ల వాయిదా పడిన ఈ ప్రాంతాల్లో ఎన్నికల ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. 

ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఇప్పటికే   ముందస్తు ప్రక్రియలు పూర్తయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆయా స్థానిక సంస్థలకు సంబంధించి  వార్డుల వారీగా రిజర్వేషన్ల ఖరారు పూర్తయ్యింది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఓటర్ల జాబితాలు, పోలింగ్ కేంద్రాల గుర్తింపు వంటి  పాలనాపరమైన ఏర్పాట్లపై ఎన్నికల సంఘం దృష్టి పెట్టింది. 

ఈ నెల 25వ తేదీ లోపు ఈ ఎన్నికల తంతును పూర్తి చేయాలనే యోచనలో ఎన్నికల సంఘం ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే పూర్తిస్థాయి షెడ్యూల్ వెలువడనుండటంతో రాజకీయ పార్టీలు కూడా  సన్నాహకాలపై దృష్టి పెట్టాయి.   ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలకు కొనసాగింపుగా ఈ పెండింగ్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అప్పట్లో కొన్ని ప్రాంతాలలో తలెత్తిన న్యాయపరమైన వివాదాలు ,  కోర్టు కేసుల కారణంగా ఈ 23 అర్బన్ లోకల్ బాడీలకు ఎన్నికలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. 

ఇది కూడా చదవండి: ఏపీలో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్: చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతం.!

నోటిఫికేషన్ వెలువడిన వెంటనే ఆయా జిల్లాల యంత్రాంగాలు ఎన్నికల కోడ్‌ను అమలులోకి తీసుకురానున్నాయి. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ పోలింగ్ తేదీలకు సంబంధించిన  వివరాలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ త్వరలోనే  ప్రకటించనున్నారు. నోటిఫికేషన్ వెలువడిన వెంటనే ఎన్నికల నియమావళి అమలులోనికి రానుంది.

 ఈ పెండింగ్  మునిసిపాలిటీలు, కార్పొరేషన్ ఎన్నికలు కూడా పూర్తై,  ఫలితాలు కూడా వెలువడితే రాష్ట్రంలో పూర్తిగా స్థానిక సంస్థల పాలన   ప్రక్రియ పూర్తవుతుంది. ఇప్పటి వరకూ జరిగిన మునిసిపోల్స్, పరిషత్ ఎన్నికలు చెదురుమదురు సంఘటనలు వినా ప్రశాంతంగా జరిగాయని ఎన్నికల సంఘం ప్రకటించింది.  

మీకు నచ్చవచ్చు: ఎన్నికల విధుల్లో విషాదం.. పోలింగ్ కేంద్రంలో టీచర్ దుర్మరణం.!

పోటీ నుంచి వైదొలగిన వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థలు: మైదుకూరు, చిన్నమండెంలో వైసీపీకి బిగ్ షాక్.!

[AP Municipal Elections Notification, Pending Urban Local Bodies AP, Andhra Pradesh State Election Commission, 4 Corporations, 19 Municipalities, Telugu One]