మళ్ళీ మరోసారి ప్రమాణ స్వీకారం

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో కొంతమంది ఎమ్మెల్యేలు రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. బుధ, గురువారాల్లో ప్రొటెం స్పీకర్ అసెంబ్లీలోని సభ్యులందరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే కొంతమంది శాసనసభ్యులు అసెంబ్లీ నియమావళి ప్రకారం ప్రమాణ స్వీకారం చేయలేదు. అందువల్ల శుక్రవారం సభాపతిగా ఎన్నికైన డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఆ సభ్యుల చేత మరోసారి అసెంబ్లీ నియమావళికి అనుగుణంగా ప్రమాణ స్వీకారం చేయించారు. అలా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో జవహర్, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఎం.వెంకటరమణ, రాజేంద్రనాథ్ రెడ్డి వున్నారు.