ఏపీ లిక్కర్ స్కామ్‌లో కీలక పరిణామం..హైదరాబాద్‌లో సిట్ సోదాలు
posted on May 13, 2025 9:39PM
.webp)
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కీలక పరిణామం చేటుచేసుకుంది. సిట్ అధికారులు హైదరాబాద్‌లో సోదాలు నిర్వహించారు. మెహిదీపట్నం, రాజేంద్రనగర్, గుడిమల్కాపూర్, షేక్‌పేట, యాకుత్‌పూరా తదితర ప్రాంతాల్లోని ఐదు కంపెనీల డైరెక్టర్ల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న భారతీ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ మైసూరులో అదుపులోకి తీసుకుంది. అతన్ని విజయవాడకు తరలించారు. మరోవైపు, ఈ కేసులో మరో ఇద్దరు నిందితులైన మాజీ ఐఏఎస్ అధికారి కె.ధనుంజయ రెడ్డి, జగన్ మాజీ ఓఎస్‌డీ కృష్ణమోహన్ రెడ్డికి సుప్రీంకోర్టు తాత్కాలిక ఊరటను అందించింది.
అదే సమయంలో హైదరాబాద్‌లో నిందితుల కార్యాలయాల్లో సిట్ సోదాలు నిర్వహిస్తోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం సరఫరా ఆర్డర్లు పొందిన కంపెనీలు, డిస్టిలరీల నుంచి నెలవారీగా రూ.50-60 కోట్ల ముడుపులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆర్థిక లావాదేవీలను నిర్వహించడంలో బాలాజీ గోవిందప్ప కీలకంగా వ్యవహరించినట్లు సిట్ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. ఈ కేసులో ఇప్పటికే ప్రధాన నిందితుడు కెసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, అతని వ్యక్తిగత సహాయకుడు దిలీప్ కుమార్, మరో నిందితుడు సిట్ అధికారులను అరెస్ట్ చేసింది.