ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ 18 నుంచి

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశాలు ఈనెల 18వ తేదీ నుంచి వారం రోజులపాటు జరుగనున్నాయని ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు. ఈనెల 18 నుంచి 24వ తేదీ వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. సెలవు దినాలతో కలిపి వారం రోజులపాటు అసెంబ్లీని నిర్వహించాలని నిర్ణయించామని కోడెల తెలిపారు. అవసరమైన పక్షంలో సమావేశాలను మరో రోజు పొడిగించే అవకాశం వుంది. ఈ శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్రంలో పెట్టుబడులు, రాజధాని నిర్మాణం, పథకాలు అమలు, సీఎం చంద్రబాబు నాయుడు సింగపూర్, జపాన్ పర్యటన, ఖరీఫ్ పంటలకు సంబంధించిన సమస్యలు, శాంతి భద్రతలు, ఎర్రచందనం వేలం తదితర అంశాల మీద చర్చ వుంటుందని కోడెల తెలిపారు. ఈ నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ అంచనాలు, పీయూసీల కమిటీ సమావేశం మంగళవారం సమావేశం కానుంది.