ఆడవారి భద్రతకై కొత్త చట్టానికి శ్రీకారం చుట్టబోతున్న జగన్...

 

ఈ రోజు ఏపీ అసెంబ్లీలో జగన్ ప్రస్తావిస్తూ మహిళల పై అత్యాచారం కేసులో 21 రోజులోనే ఉరిశిక్ష పడేలా కొత్త చట్టాన్ని తీసుకురాబోతున్నట్టు ప్రకటించారు సీఎం జగన్. వారం రోజుల్లోనే విచారణ పూర్తి చేసేలా ఆయన ఈ చట్టం ఉంటుందన్నారు. ప్రతి జిల్లాలోనూ ప్రత్యేక కోర్టుల ఏర్పాటు చేస్తామన్నారు. మహిళల రక్షణ పై అసెంబ్లీలో జరిగిన చర్చలో కొత్త చట్టం ఎలా ఉంటుందో వివరించారు సీఎం జగన్. ఎల్లుండే ఈ చట్టాన్ని ప్రవేశపెడతామన్నారు. ఆడ వాళ్ల  మరియు చిన్న పిల్లల పై జరిగే నేరాల కోసం వారికి జరిగే అన్యాయాల పై జగన్ సర్కార్ స్పందిస్తూ కొత్త చట్టానికి నాంది పలుకుతోంది. ఇందులో భాగంగా ఆడవాళ్ల పై మానభంగాలు చేయడం గానీ, ఆడవాళ్ళ ప్రొటెక్షన్ కోసం గానీ,ఇటువంటి సంఘటనలు ఏవైన జరిగితే ప్రతి జిల్లా లోనూ ఒక డెడికేటెడ్ కోర్టు కూడబెట్టాల్సిన అవసరం  ఉందని జగన్ అసెంబ్లీ సాక్షిగా తెలిపారు.కేవలం ఇటువంటి కేసులను మాత్రమే డీల్ చేసే విధంగా అడుగులు వేసే దిశగా అవసరం  ఉన్న పరిస్థితులు ఉన్నాయని ఆ దిశగా కూడా తమ ప్రభుత్వం  అడుగులు వేస్తుందని జగన్ పేర్కొన్నారు. 

అదే విధంగా ఈ రోజు సోషల్ మీడియాల్లో కూడా పలు సంఘటనలు చూస్తున్నామని, నిజంగా ఒకొకసారి ఆ సోషల్ మీడీయాని చూస్తే తనకు చాలా బాధనిపిస్తుందని, భయమేస్తొందని కేవలం వేరే వ్యక్తుల మీద బురదజల్లే దాని కోసం అసలు ఎటువంటి మనస్సాక్షి అనేది లేకుండా ఈ మధ్య కాలంలో సోషల్ మీడయా దిగజారిపోయిన పరిస్థితి కనిపిస్తోందని జగన్ వ్యాఖ్యానించారు. ఇటువంటి పరిస్థితుల్లో  సోషల్ మీడియాలో కూడా ఆడవాళ్లను రక్షించే కార్యక్రమం జరగాలని అసెంబ్లీ సాక్షిగా జగన్ కోరారు. సోషల్ మీడియాలో కూడా ఎవరైనా ఆడవాళ్ళ గురించి ఏదైన పోస్టింగ్ నెగటివ్ గా చేస్తే వాళ్లకు శిక్ష పడుతుందందన్న భయం ఉంటే తప్ప ఇది ఆగిపోదని జగన్ వెల్లడించారు. చట్టాల్లో మార్పులు తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తున్నామని, వెంటనే ఇటువంటి పోస్టింగ్స్ ఏదైన చేస్తే  సెక్షన్ 354 ను ప్రతిపాదించే ఆలోచనలో ప్రభుత్వం ఉందని జగన్ తెలిపారు.