ఏపీలో ఓట్ల తొలగింపు.. అస్సలు నమ్మొద్దు!!

 

ఏపీలో సర్వేల పేరుతో.. వైసీపీ సానుభూతిపరుల ఓట్లను అధికార పార్టీ టీడీపీ తొలగించిందని వైసీపీ నేతలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. వైసీపీ అధినేత జగన్ అయితే ఏకంగా ఢిల్లీ వెళ్లి.. టీడీపీ ప్రభుత్వం వైసీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించి, 50 లక్షల దొంగ ఓట్లు చేర్చిందని కేంద్ర ఎన్నికల సంఘానికి కంప్లయింట్ ఇచ్చారు. అదే ఫ్లోలో గవర్నర్ కు కూడా కంప్లయింట్ చేశారు. దీనిపై ఎన్నికల సంఘం విచారణకు కూడా ఆదేశించింది. అయితే విచారణ అనంతరం ఇది ఆరోపణ మాత్రమే అని తేలింది. ఆంధ్రప్రదేశ్‌లో ఓట్ల తొలగింపు అనేది పుకారు మాత్రమే అని ఎవరూ నమ్మవద్దని ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది స్పష్టం చేశారు. ఓటర్ల జాబితాను ప్రభావితం చెయ్యడం అనేది అసాధ్యమని, ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. జనవరి 11 వరకు నమోదైన ఓటర్ల జాబితా చెక్ చేసుకోవచ్చని ఆయన చెప్పారు. నామినేషన్ చివరిరోజు వరకు జాబితాలో మార్పులు, చేర్పులకు అవకాశం ఉందన్నారు. దీంతో వైసీపీ చేసిన ఆరోపణల్లో నిజంలేదని తేలిపోయిందంటూ టీడీపీ నేతలు చెప్తున్నారు.