పశ్చిమగోదావరి జిల్లా పెరవలి ఎస్సై సస్పెన్షన్ రద్దు?

పోలీసులు కూడా అతి చేయ‌కుండా వుండాలి. జ‌నం కూడా ప్ర‌స్తుత ప‌రిస్థితులు అర్థం చేసుకోవాలి. లేక‌పోతే ఒక‌రి మీద ఒక‌రు ఫిర్యాదు చేసుకుంటుంటే క‌రోనా కాటుకు గురికాక త‌ప్ప‌దు. సంయ‌మ‌నం పాటించ‌క‌పోవ‌డం వ‌ల్లే పెర‌వ‌లి సంఘ‌ట‌న జ‌రిగింది.

పెరవలి ఎస్సై నీతి నిజాయతీ కల్గిన డ్యూటీ పట్ల నిబద్దత కల్గిన ఆఫీసర్ అరి స్థానికుడు కోటిపల్లి అయ్యప్ప చెబుతున్నారు. అయితే గత ఆదివారం నుంచి ఒక్క నిమిషం కూడా రెస్ట్ తీసుకోకుండా మండలంలో విదేశాలు నుంచి 127 మందిని గుర్తించి గత సోమవారం నుంచి 4 రోజులుగా ఇంటిటికి వెళ్లి కౌన్సెలింగ్ ఇస్తూ బయటకు వెళ్లొద్దు అని నోటీసులు ఇచ్చార‌ట‌.

ఇదే విషయంలో పూర్తి శ్రద్ద పెట్టిన వాలంటీర్లు ,ఆశావర్కర్లు విదేశాల నుంచి వచ్చిన వారికి కౌన్సెలింగ్ ఇస్తున్నారు.

ఇదే క్రమంలో ఖండవల్లి గ్రామంలో దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తి కుటుంబానికి కౌన్సెలింగ్ ఇస్తే నా ఇష్టం నేను తిరుగుతా అని వాలంటీర్ల మీద అసభ్యంగా మాట్లాడితే దానికి తల్లిదండ్రులు వత్తాసు పలికి వాడికి రోగం లేదు అని ఇంకోసారి ఇంటికి వస్తే మర్యాదగా ఉండదు అని హెచ్చరించడంతో గొడ‌వ జరిగింది.

ఈ విష‌యాన్ని వాలంటీర్లు ఎస్సై దృష్టికి తీసుకువెళ్లితే అత‌ను కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా దుబాయ్ నుంచి వ‌చ్చిన వ్య‌క్తి విచ్చ‌ల‌విడిగా తిరుగుతూ వుండ‌టంతో స్థానికులు భ‌య‌ప‌డి ఎస్సై ఫోన్ చేసి చెప్పార‌ట‌.

దీంతో అడగడానికి వచ్చిన ఎస్సై కి, దుబాయ్ నుంచి వ్య‌క్తి కుటుంబ‌స‌భ్యుల మ‌ధ్య వాగ్వివాదం జ‌రిగింది. చుట్టు ఉన్న చిన్న పిల్లలు అది అది అని ఈలలు వేసి పోలీసుల్ని చులకన చేసి ఆట పట్టించారు. ఆ వీడియో ఎడిటింగ్ చేసి సోషల్ మీడియాలో పెడితే అధికారి మీద చర్యలు తీసుకున్నారు. *ఎస్సై ని నీ అమ్మా లంజాకొడకా అనడంతో జనాల్లో హీరో అయ్యాడు*
ఎస్సై ని సస్పెండ్ చేశార‌ని తెలియ‌డంతో, ఇత‌ర‌ పోలీసులు ఉరిలోకి వస్తుంటే ఈలలు వేసి ఆట పట్టిస్తున్నారు జనం. గుమిగూడి మీటింగ్ లు పెట్టుకుంటున్నారు.

పోలీసులు శిక్ష వేసేది ప్రజల కోసమే. కేవలం ప్లాస్టిక్ స్టిక్ తో కొడితే ఇలా సస్పెండ్ చేస్తున్నారు. ఇదే సంఘటన అదునుగా చూసి ప్రజలు పోలీసుల మీద ఎదురు తిరుగుతున్నారు పోలీసులు కూడా సస్పెండ్ అవ్వుతాము అని భయంతో వదిలేస్తున్నారు. ప‌రిస్థితి చేయి దాటి పోతే ఇటలీ లాగా ఉంటుంది.

స్థానిక శాస‌న‌స‌భ్యుడి దృష్టికి ఈ వ్య‌వ‌హారం వెళ్ళ‌డంతో ఎన్జీవోస్ కాలనీ లో ఎమ్మెల్యే కారుమూరి పర్యటించారు. తణుకు సిఐ డి ఎస్ చైతన్య కృష్ణ, మీడియాతో మాట్లాడి హోంమినిస్టర్ కు, ఫిర్యాదు చేయడంతో, ఎస్సై సస్పెండ్ నిలుపుదల చేశారు.