అస్సలు భయపడొద్దు.. కరోనా కూడా జ్వరం లాంటిదే: సీఎం జగన్

కరోనా వైరస్ కి ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి కానీ.. ఏపీ సీఎం వైఎస్ జగన్ మాత్రం అసలు భయపడాల్సిన అవసరమే లేదు అంటున్నారు. ఏపీలో గంటల వ్యవధిలోనే 40 కి పైగా కరోనా పాజిటివ్ నమోదైన నేపథ్యంలో.. రాష్ట్ర ప్రజలకు ధైర్యం చెప్పడంలో భాగంగా ప్రెస్ మీట్ పెట్టిన సీఎం జగన్.. కరోనాని సింపుల్ గా తీసి పడేశారు. కరోనా వస్తుందని ఓ ఇది అయిపోకండి. అది కూడా ఓ జ్వరం లాంటిదేనని తేల్చేశారు.

కరోనా వస్తే ఏదో పెద్ద జబ్బు వచ్చిందని బాధ పడొద్దని, పద్నాలుగు రోజుల్లో తగ్గిపోతుందని తెలిపారు. కుటుంబ సభ్యులలో ఎవరికైనా కరోనా సోకితే, వారితో ఆప్యాయంగా ఉంటూ ధైర్యం చెప్పాలని అన్నారు. అంతేకాదు, అసలు కరోనా వచ్చినా.. 80 శాతం మందికి ఇంట్లోనే నయమైపోతుందని.. కేవలం 4 శాతం మందిని మాత్రమే ఐసోలేషన్ లో పెడతారని చెప్పుకొచ్చారు. కాబట్టి కరోనా గురించి అసలు హైరానా పడాల్సిన అవసరం లేదని, కనీస జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని సీఎం చెప్పారు.