ఏపీ రాజధాని.. ఓకే చెప్పిన ప్రపంచ బ్యాంక్

 

ఏపీ నూతన రాజధానిలో అమరావతిలో మొదటి భాగంలో సచివాలయం, హైకోర్టు, రాజ్‌భవన్‌ తదితర ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే వీటి నిర్మాణానికి కేంద్రం నిధులు ఇస్తానన్న కేంద్ర ఇచ్చే నిధులు సరిపోవని ఏపీ ప్రభుత్వం ప్రపంచ బ్యాంకును అశ్రయించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రాజధాని నిర్మాణానికి సహకరించాలని ప్రపంచ బ్యాంకు ప్రతినిధులకు ఏపీ ప్రభుత్వం కోరినట్టు సమాచారం. దీనికి ప్రపంచ బ్యాంకు కూడా సానుకూలంగా స్పందించి రాజధాని నిర్మాణానికి ఎంత పెట్టుబడి కావాలో దానిపై నివేదిక ఇస్తే నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకుంటామని ప్రపంచ బ్యాంకు అధికారులు తెలిపారు. దీనిపై చర్చించేందుకు ఇప్పటికే ఏపీ సీఎ్‌సతో కేంద్ర ప్రభుత్వ ఆర్థికశాఖ కార్యదర్శి రవికుమార్‌, ప్రపంచ బ్యాంకు భారత ప్రతినిధి ఓర్లార్‌ హుల్‌ తదితరులు భేటీ అయ్యారు.