ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ పర్యటన.. ఎందుకు? ఎప్పుడు?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ లో పర్యటించనున్నారు. రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయంగా ఈ నెల 26 నుంచి ఐదు రోజుల పాటు చంద్రబాబునాయుడు సింగపూర్ లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో చంద్రబాబుతో పాటు మంత్రులు నారా లోకేష్, నారాయణ, టీజీ భరత్ కూడా ఉంటారు. ఉన్నతాధికారుల బృందం కూడా ఈ పర్యటనలో పాల్గొంటుంది.  

ఈ పర్యటనలో చంద్రబాబు బృందం సింగపూర్ లో ప్రభుత్వ పెద్దలతో పాటు,  పలువురు పారిశ్రామిక వేత్తలతో భేటీ అవుతుంది.  ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలను వారికి వివరిస్తుంది. అలాగే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే వారికి ఏపీ సర్కార్ అందిస్తున్న ప్రోత్సాహకాలను వివరిస్తుంది. ప్రధానంగా  ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రెనెవబుల్ ఎనర్జీ రంగాలలో పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా చంద్రబాబు సింగపూర్ పర్యటన సాగనుంది.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu