దొనకొండలో నాకు ఎలాంటి భూములు లేవు-ఐవైఆర్

ప్రకాశం జిల్లా దొనకొండలో తనకు భూములు ఉన్నాయంటూ ఎంపీ రాయపాటి సాంబశివరావు చేసిన ఆరోపణలపై మాజీ ఐఏఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావు స్పందించారు. రాయపాటి చెప్పినట్లు దొనకొండలో ఎలాంటి భూములు లేవని ఆయన స్పష్టం చేశారు. అవసరమైతే ఈ విషయంపై విచారణ జరిపించాలని సీఎం చంద్రబాబును కోరారు. తనకు భూలములుంటే ఎలాంటి చర్యలు ఎదుర్కోవడానికైనా సిద్ధమని ఛాలెంజ్ చేశారు.