ఏపీలో మూడు రోజులు భారీ వర్షాలు

 

నైరుతి రుతుపవన ప్రభావంతో ఏపీలో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొన్నాది. వాతావరణంలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. వివరాల్లోకి వెళితే, ముఖ్యంగా శనివారం నాడు రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో వర్షాలు కురిసే సూచనలున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు. ఇదే సమయంలో పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య జిల్లాల్లో కూడా ఇలాంటి వర్షపాతమే నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, అడపాదడపా వర్షపు జల్లులు కురిసే పరిస్థితులు కొనసాగుతాయని తెలుస్తోంది. ఈ మార్పుతో వాతావరణం కొంత చల్లబడే అవకాశం ఉంది. పలు జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.రెండు రోజులపాటు భారీ వర్షాలతోపాటు.. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని వెల్లడించింది. రానున్న మూడు రోజులు రాష్ట్రంలో మేఘావృత వాతావరణంతో పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu