TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అమెరికాలో స్తంభించిన విమానయానం: మూడో రోజు వేలాది విమానాలు రద్దు.!

Published on: Sun Nov 15, 2026 10:10AM

అమెరికాలో విమానయాన సంక్షోభం కొనసాగుతోంది. వరుసగా మూడో రోజు ఆదివారం (నవంబర్ 15) కూడా వేలాది విమానాలు రద్దయ్యాయి.  ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కమ్యూనికేషన్ వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా ఈ పరిస్థితి తలెత్తింది.

శుక్రవారం నుంచి ఈ లోపం కారణంగా  వేలాది విమానాలు రద్దయ్యాయి. లక్షలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లోనే చిక్కుకుపోయారు.  చికాగో, న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కో సహా   దేశంలోని విమానాశ్రయాలన్నీ దాదాపు మూతపడ్డాయి. విమాన రాకపోకలకు అవకాశం లేకుండా పోయింది. దీంతో   ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  

విమానయాన ట్రాకింగ్ వెబ్‌సైట్  ఫ్లైట్ అవేర్ మేరకు , శనివారం (నవంబర్ 14) సాయంత్రానికి  దేశవ్యాప్తంగా 6,150కి పైగా విమానాలు రదయ్యాయి, మరో 7,300 విమానాలు విపరీతమైన ఆలస్యంతో నడుస్తున్నాయి. అంతకు ముందు నడిచాయి. అంతకుముందు శుక్రవారం (నవంబర్ 13) కూడా దాదాపు 9 వేల 200కు పైగా విమానాలు రద్దయ్యాయి. 7 వేల 500 విమానాలు ఆలస్యమయ్యాయి. ఇక ఆదివారం (నవంబర్ 15)  కూడా వేల సంఖ్యలో విమానాలు రద్దయ్యాయి. సాంకేతిక లోపం కారణంగా తలెత్తిన ఈ అంతరాయంపై ఎఫ్ఏఏ   ప్రయాణికులకు   క్షమాపణలు చెప్పింది. ఈ సంకేతిక లోపాన్ని సరిదిద్ది యథావిధిగా విమానరాకపోకల పునరుద్ధరణకు మరో రోజు పడుతుందని ఎఫ్ఏఏ ఒక ప్రకటనలో తెలిపింది.    

పాతకాలపు హార్డ్‌వేర్ సిస్టమ్స్, రూటర్లు,  కాపర్ కేబుల్స్ పై అధిక డేటా భారం పడటమే ఈ సమస్యకు ప్రధాన కారణమని ప్రాథమికంగా గుర్తించారు. రాడార్,  కమ్యూనికేషన్ వ్యవస్థలలో అస్థిరత ఏర్పడటంతో సిస్టమ్స్ మొరాయించినట్లు అధికారులు గుర్తించారు.  ఈ ఘటన వెనుక ఎలాంటి సైబర్ దాడి లేదా ఉగ్ర చర్యలేదని అధికారులు వెల్లడించారు.  అమెరికా వైమానిక చరిత్రలో ఇలాంటి పరిస్థితి గతంలో ఎన్నడూ ఉత్పన్న కాలేదని చెబుతున్నారు.

ఇది కూడా చదవండి:  బొమ్మ తుపాకీ, క్రికెట్ బంతితో విమాన హైజాక్: సెన్సేషనల్ పొలిటికల్ స్టంట్.!

 గతంలో కొన్ని అసాధారణ పరిస్థితుల్లో తప్ప ఇలా ఒకేసారి దేశవ్యాప్తంగా విమానాలను నిలిపివేయాల్సిన పరిస్థితి తలెత్తలేదు. ఈ తాజా పరిణామం అమెరికా రవాణా రంగంపై కొలుకోలేని దెబ్బగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.  విమానయాన సంస్థలు ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం, సమాచారం అందించడం వంటి చర్యలు చేపట్టినప్పటికీ, భారీ సంఖ్యలో విమానాలు రద్దు కావడం లేదా ఆలస్యం కావడంతో ఎయిర్‌పోర్టులలో రద్దీ విపరీతంగా పెరిగింది.

సాంకేతిక సమస్యను పరిష్కరించినా నిలిచిపోయిన విమానాల షెడ్యూల్స్ అన్నీ గాడిన పడటానికి,  ప్రయాణాల రద్దీ సాధారణ స్థితికి రావడానికి రోజుల సమయం తీసుకుంటుందని  విమానయాన రంగ నిపుణులు చెబుతున్నారు.   ఈ ఘటనతో అమెరికాలో  సాంకేతిక మౌలిక వసతులను ఆధునీకరించాల్సిన అవసరంపై చర్చ మళ్లీ జోరందుకుంది.  భవిష్యత్తులో ఇలాంటి వైఫల్యాలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలను   పటిష్టం చేయాలని, అత్యాధునిక సాంకేతికతను జోడించాలని నిపుణులు అంటున్నారు.

మీకు నచ్చవచ్చు: అగ్రరాజ్యం మధ్యంతర ఎన్నికల వ్యయం: కొత్త రికార్డు.. లక్ష కోట్లు దాటేసింది.!

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ముప్పు: 109 మంది ప్రయాణీకులు సురక్షితం.!

[America flights grounded, FAA network outage, air travel disruption, Technicalerror, TeluguOne]