అక్బరుద్దీన్ ఫై సర్వత్రా విమర్శలు

 

 

 

ఎంఐఎం ఎంఎల్ఏ అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలఫై దేశవ్యాప్త దుమారం చెలరేగుతుంది. ఎంఎల్ఏ గా ఉండి మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరించిన ఒవైసీను దాదాపు అన్ని రాజకీయ పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.

 

ఓట్ల కోసం ఇలా ప్రజలను రెచ్చగొట్టడాన్ని ఆ పార్టీలు తప్పుబడుతున్నాయి. కాంగ్రెస్, బిజెపిలు ఎంఐఎం నేతఫై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఆయనఫై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. అసలు ఆయన ఎంఎల్ఏ గా పనికిరాడంటూ కూడా వ్యాఖ్యలు చేస్తున్నాయి. భారత దేశంలో అన్ని మతాల ప్రజలు సోదరభావంతో ఉంటారని, ఆ వాతావరణాన్ని ఇలాంటి ప్రసంగాలు చెడగొడతాయని ఆ పార్టీలు అభిప్రాయపడుతున్నాయి.

 

రాష్ట్ర డిజిపి దినేష్ రెడ్డి నిన్న ఓ ప్రకటన చేస్తూ, ఒవైసీఫై ఇండియన్ పీనల్ కోడ్ లోని సెక్షన్లు 121, 153 A కింద ఆయన ఫై కేసులు నమోదు చేసామని, ఇందుకు తగిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని ప్రకటించారు. లండన్ వెళ్ళినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారని, అవసరమైతే, ఆయనను అరెస్టు చేయడానికి ఇంటర్ పోల్ సహాయం తీసుకొంటామని డిజిపి తెలియచేసారు.

 

సెక్షన్ 121 అంటే ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించడం. ఏదేని రెండు వర్గాలు లేక మతాల మధ్య శత్రుత్వం సృష్టించడం సెక్షన్ 153 A కిందకు వస్తుంది.