TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సురేఖ వాణి ఇన్ స్టా గ్రామ్ హ్యాక్: సోషల్ మీడియాలో ప్రైవేట్ వీడియోలు వైరల్.!

Published on: Sat Nov 7, 2026 2:46PM

టాలీవుడ్ నటి సురేఖ వాణి వ్యక్తిగత జీవితానికి సంబంధించి సోషల్ మీడియాలో తీవ్ర కలకలం రేగింది. ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతా హ్యాక్ కావడంతో పాటు, దానికి సంబంధించిన కొన్ని ప్రైవేట్ వీడియోలు, కంటెంట్ సామాజిక మాధ్యమాలలో వైరల్ కావడం వివాదంగా మారింది. 

ఈ అనూహ్య పరిణామంపై సురేఖ వాణి తీవ్రంగా స్పందిచారు.  సోషల్ మీడియా వేదికగా ఆమె తన సోషల్ మీడియా ఖాతా పూర్తిగా హ్యాకర్ల నియంత్రణలోకి వెళ్ళిందని, తన అనుమతి,  ప్రమేయం లేకుండానే కొందరు దుర్వినియోగం చేసి వ్యక్తిగత కంటెంట్‌ను ఆన్‌లైన్‌లో సర్క్యులేట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం వ్యూస్, లైక్స్, రీచ్,  పబ్లిసిటీ కోసం మరొకరి వ్యక్తిగత జీవితాన్ని, గోప్యతను అడ్డుపెట్టుకోవడం సరికాదని  హితవు పలికారు.

మీమ్ పేజీలు, మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానెళ్లు,  సోషల్ మీడియా యూజర్లు ఎవరైనా సరే ఈ వైరల్ కంటెంట్‌ను రీపోస్ట్ చేయడం, అప్‌లోడ్ చేయడం,  షేర్ చేయడం తక్షణమే ఆపాలని సురేఖ వాణి  పేర్కొన్నారు. ఇది తన వ్యక్తిగత గౌరవానికి, గోప్యతకు సంబంధించిన   సున్నితమైన అంశమని, దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

తన హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఎవరైనా సరే   ప్రైవేట్ కంటెంట్‌ను షేర్ చేసినా,  ప్రచారం చేసినా వారి వివరాలు సేకరించి చట్టపరంగా  చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.   ఈ మేరకు సదరు కంటెంట్‌ను తక్షణమే తొలగించాలని, తన ప్రైవసీని గౌరవించాలని ఆమె అందరికీ విజ్ఞప్తి చేశారు.

ఇది కూడా చదవండి: చిరంజీవి ఫేక్ వీడియోలు.. సజ్జనార్ మాస్ వార్నింగ్..!

వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేలా సామాజిక మాధ్యమ వేదికగా ఇటీవలి కాలంలో ప్రముఖులకు సంబంధించిన వీడియోలు, కంటెంట్ ను దుర్వినియోగం చేస్తున్న తీరు పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతున్నది. చిరంజీవి సహా పలువురు ప్రముఖులు తమ ప్రతిష్ఠకు భంగం వాటిల్లేలా సోషల్ మీడియాలో వస్తున్న కంటెంట్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. 

తాజాగా సురేఖ వాణి ఇన్ స్టా గ్రామ్ హ్యాక్ చేసి కొందరు ఆమె వ్యక్తిగత ప్రతిష్ఠకు, గోప్యతకు భంగం వాటిల్లేలా పోస్టులు చేయడం పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతున్నది. ఈ ధోరణిని అరికట్టాల్సిన అవసరం ఉందని అంటున్నారు. 

మీకు నచ్చవచ్చు: నెట్టింట మోడీ మార్ఫింగ్ వీడియో: సీజేపీ నేతలకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు.!

డీప్ ఫేక్ పై హీరో అభిమానుల బాధ్యతాయుతమైన పోరాటం: ఇక అసాంఘిక శక్తుల ఆట కట్టు! 

[Actor Surekha Vani Instagram Hacked, Surekha Vani Viral Video, Telugu actress Personal Content Leak, Surekha Vani warning, TeluguOne]