నెట్టింట మోడీ మార్ఫింగ్ వీడియో: సీజేపీ నేతలకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు.!
Published on: Sat Sep 26, 2026 2:30PM

సామాజిక మాధ్యమాల్లో ఏఐ టెక్నాలజీని దుర్వినియోగం రోజు రోజుకూ పెచ్చరిల్లుతోంది. కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా ప్రముఖులను బదనాం చేయడానికి చేస్తున్న తప్పుడు ప్రచారం, డీప్ ఫేక్, మార్ఫింగ్ ఫొటోలూ సోషల్ మీడియాలో పేర్ చేస్తు సాంకేతికతను దుర్వినియోగం చేస్తున్నారు. ఈ పరిణామాలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి.
తాజాగా ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన ఒక మార్ఫింగ్ ఫోటో నెట్టింట వైరల్ అయిన ఉదంతం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రధాని మోడీ ఓ మహిళతో ఉన్నట్లుగా సృష్టించిన ఒక మార్ఫింగ్ ఏఐ వీడియో ఒక మహిళతో దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నట్లుగా సృష్టించిన ఏఐ మార్ఫుడ్ సీజేపీకి చెందిన నేతలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ చర్యపై తీవ్ర మనస్తాపానికి గురైన బాధిత మహిళా న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఈ వివాదం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదుకు స్పందించిన ఢిల్లీ హైకోర్టు ఈ వ్యవహారంపై సీరియస్‌గా స్పందించింది.
ఈ కేసు విచారణ చేపట్టిన జస్టిస్ గిరీష్ కత్పాలియా నేతృత్వంలోని ధర్మాసనం ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక సాధారణ మహిళతో దేశ ప్రధాని ఉన్న ఫొటోను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయడం తీవ్రమైన పరిణామమని కోర్టు పేర్కొంది. ఈ ఘటనకు బాధ్యులైన సీజేపీ సంస్థ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, కీలక నేతలు అశుతోష్ రాంకా, రత్నా సింగ్‌లతో పాటు సంబంధిత వ్యక్తులకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అంతేకాకుండా, ఈ వివాదాస్పద ఫోటో, దానికి సంబంధించిన అన్ని సోషల్ మీడియా పోస్టులను వెంటనే తొలగించాల్సిందిగా ప్రముఖ టెక్ దిగ్గజం మెటాను ఆదేశించింది.
.webp)
ఇంటర్నెట్‌లో ఎక్కడైనా ఈ మార్ఫింగ్ ఫోటో ఉంటే అన్ని వెబ్‌సైట్ల నుంచి ఒక్క రోజు వ్యవధిలోనే పూర్తిగా తొలగించాలని ఢిల్లీ హై కోర్టు విస్పష్ట ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు.. ఈ అంశంపై ఇప్పటికే ఢిల్లీ పోలీసులు ఐటీ యాక్ట్, బీఎన్ఎస్ (BNS) సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులకు కూడా కోర్టు నోటీసులు జారీ చేసింది. సోషల్ మీడియా వేదికగా వేధింపులకు గురవుతున్న ఆ మహిళకు రక్షణ కల్పించాలని ఢిల్లీ పోలీసులను హైకోర్టు ఆదేశించింది.
[PM Modi, Morphed Photo, Delhi High Court, CJP Leaders, Notices, Abhijeet Dipke, Meta Company, Telugu One]


