20 అడుగుల లోతులో పడిన కారు.. అందరూ సేఫ్..!!

సొంత తప్పిదం వల్లనో లేక వేరే వారి తప్పిదం వల్లనో రోడ్ ప్రమాదాల్లో అనేకమంది ప్రాణాలు వదులుతూ ఉంటారు.. కానీ తాజాగా ఓ నలుగురు స్నేహితులు పెద్ద రోడ్ ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడ్డారు.. అంతే కాదు ఆ ప్రమాదం కూడా కాస్త భిన్నంగా జరిగింది.. మహమ్మద్ నౌషాద్ అనే వ్యక్తి తన ముగ్గురు స్నేహితులతో కలిసి కారులో సర్వీస్ రోడ్ నుండి.. ఆగ్రా - లక్నో ఎక్స్ ప్రెస్ వే వైపు వెళ్తున్నారు.

 

 

ఆ రూట్ లో వెళ్లడం మొదటిసారి కావడంతో గూగుల్ మ్యాప్స్ ద్వారా వెళ్తున్నారు.. అలా వెళ్తుండగా ఉన్నట్టుండి ఒక్కసారిగా కారు సుమారు 20 అడుగుల లోతున్న గోతిలో పడిపోయింది.. రోడ్ మీద వెళ్లాల్సిన వారు క్షణాల్లో లోయలో పడటంతో కొద్దిసేపు నలుగురికి ఏం అర్థంకాలేదు.. అదృష్టం కొద్దీ నలుగురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.. నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు కాబట్టి సరిపోయింది, ఒకవేళ ఏదైనా జరిగుంటే ఏం చేసేవారు? అంటూ సామాన్యులు మండిపడుతున్నారు.. అసలు రోడ్ పక్కన అంత పెద్ద గొయ్యి ఎలా పడింది?.. అది ప్రమాద స్థలం అని కొత్త వారికి తెలిసేలా చేయకపోతే ఎలా? అంటూ ప్రభుత్వం మీద అధికారుల మీద మండిపడుతున్నారు.. మరోవైపు చేతులు కాల్చి బర్నాల్ రాసినట్టుగా యూపీ ప్రభుత్వం ఇప్పుడు దిద్దుబాటు చర్యలు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది.. దీనిపై విచారణకు ఆదేశించింది.