మొబైల్ క‌నెక్ష‌న్‌కు కూడా ఆథార్.. కొత్త ఆదేశాలు..

 

ఇప్పటికే పలు పథకాలకు ఆధార్ ను తప్పనిసరి చేసిన కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. ఇకపై ముబైల్  క‌నెక్ష‌న్‌కు కూడా ఆధార్ తప్పని సరి చేయాలని నిర్ణయించుకుంది. దీనిలో భాగంగానే ఆదేశాలు జారీ చేసింది. ఇక‌పై మొబైల్ ఫోన్ కనెక్షన్లకు ఆధార్ ఆధారిత ఈ-కేవైసీననే పాటించాలని ప్ర‌క‌టించింది. దీంతో టెలికం డిపార్ట్‌మెంట్(డీవోటీ) స్పందిస్తూ... ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ సబ్‌స్కైబర్లకు ఇచ్చిన అన్ని లైసెన్స్‌లను ఈ-కేవైసీ ద్వారా మరో మారు ధ్రువీకరించుకోవాలంటూ టెలికం కంపెనీలకు సూచించింది. ఈ మొత్తం ప్ర‌క్రియ‌ను ఫిబ్రవరి 6, 2018 నాటికి పూర్తిచేయాలని, అనంత‌రం ఆధార్‌తో అనుసంధానం కాని మొబైల్ నంబర్‌ను అక్రమమైనవిగా గుర్తిస్తామని తెలిపింది.