పదో తరగతి ఫలితాల్లో 91 శాతం ఉత్తీర్ణత..  యధావిధిగా బాలికలదే పై చేయి 

తెలంగాణలో పదో తరగతి పరీక్షా ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు, తల్లిదండ్రులకు గుడ్​న్యూస్​.తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి.  . రిజల్ట్స్​ కోసం చూస్తున్న వారి ఎదురు చూపులకు తెరదించుతూ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలు విడుదల చేశారు.  ఈ యేడు  విద్యార్థులు పదోతరగతి ఫలితాల్లో 91.31 శాతం ఉత్తీర్ణత సాధించారు. 
పదోతరగతి ఫలితాల్లో బాలికలదే పైచేయి అయింది. 
పదోతరగతి ఫలితాల్లో బాలికల ఉత్తీర్ణత శాతం 93.23, 
పదోతరగతి ఫలితాల్లో బాలుర ఉత్తీర్ణత శాతం 89.42 నమోదైంది.
6 పాఠశాలల్లో సున్నా శాతం ఉత్తీర్ణత నమోదైంది. 
సున్నా ఫలితాలు వచ్చిన పాఠశాలలన్నీ ప్రైవేట్‌వే అని బుర్రా వెంకటేశం తెలిపారు. 
99.09 శాతం ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో  నిర్మల్ జిల్లా నిలిచింది. 
98.65 శాతం ఉత్తీర్ణతతో రెండో స్థానంలో  సిద్దిపేట జిల్లా ఉంది. 
98.27 శాతం ఉత్తీర్ణతతో మూడో స్థానంలో  సిరిసిల్ల జిల్లా నిలిచింది. 
65.10 ఉత్తీర్ణతతో  వికారాబాద్ జిల్లా అట్టడుగున నిలిచింది. 
పదో తరగతి పరీక్షలు  5,05,813 లక్షల మంది విద్యార్థులు రాశారు. 
పదోతరగతి పరీక్షలు రాసిన వారిలో 4,94,207 మంది రెగ్యులర్ విద్యార్థులు ఉండగా
పదోతరగతి పరీక్షలు రాసిన వారిలో 11,606 మంది ప్రైవేట్ విద్యార్థులు ఉన్నారు. 
మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు జరిగిన పదోతరగతి పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. 
  ఇందులో బాలురు 2లక్షల 57వేల 952 మంది కాగా, బాలికలు 2లక్షల, 50వేల 433 మంది ఉన్నారు. సుమారుగా 30వేల మంది ఇన్విజిలేటర్లు విధుల్లో పాల్గొన్నారు. ఏప్రిల్​ 20లోపు మూల్యాంకనాన్ని పూర్తి చేశారు. అలాగే మార్కుల నమోదుతో పాటు ఎలాంటి టెక్నికల్‌ ఇబ్బందులూ రాకుండా ముందస్తు  జాగ్రత్తలు తీసుకున్నారు. జవాబు పత్రాలను మూడు సార్లు పరిశీలించడంతో పాటు కోడింగ్, డీకోడింగ్‌ ప్రక్రియ పూర్తి చేశారు. ఫలితాలు విడుదల అవ్వగానే సర్వర్‌ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.