పోలీసులకు తరుణ్ తేజ్‌పాల్ టోకరా!

 

 Tarun Tejpal to appear before Goa Police, Tarun Tejpal sexual assault case, Tarun Tejpal is out, Tarun J Tejpal

 

 

మహిళా జర్నలిస్టుపై వేధింపులకు పాల్పడిన తెహల్కా ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్ పోలీసులను బురిడి కొట్టించారు. ఈ రోజు ఉదయం పోలీసులు తేజ్‌పాల్ ఇంటికి వెళ్ళారు. అయితే అప్పటికే తేజ్‌పాల్ ఇంటి నుంచి వెళ్లిపోయారు. కాగా అతడి ఆచూకి తెలిపేందుకు కుటుంబసభ్యులు నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో నేడు పోలీసులు ఎదుట తేజ్‌పాల్ హాజరయ్యే అవకాశం ఉంది. తన నివాసంలో తేజ్‌పాల్ లేకపోవడంతో అతడి బంధువల ఇళ్లలోనూ పోలీసులు సోదాలు చేయనున్నారు.

 

గురువారం సాయంత్రం 3 గంటల్లోగా అతను పోలీసుల ముందు హాజరు కావాల్సి ఉంది. దాంతో పోలీసులు మెజిస్ట్రేట్ నుంచి నాన్ బెయిలబుల్ అరెస్టు వారంట్‌ను పొందారు. తాను మర్నాడు గోవా వస్తానని, తాను విచారణకు సహకరిస్తానని తరుణ్ తేజ్‌పాల్ గురువారంనాడు సమాచారం అందించాడు. తనకు శనివారం వరకు గడువు ఇవ్వాలని తరుణ్ తేజ్‌పాల్ అంతకు ముందు గోవా పోలీసులను కోరాడు. అయితే, వారు అందుకు నిరాకరించారు. ఆయన ముందస్తు బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.