గాదెవెంకటరెడ్డి చొక్కా పట్టుకున్న ఎమ్మెల్యే ..!

 

 

 

ఓ ఎమ్మెల్యే శాసనసభలో మరో ఎమ్మెల్యే చొక్కా పట్టుకోవడం సభలో కలకలం రేపుతోంది. ఈటెల రాజేందర్, ద్రోణంరాజు శ్రీనివాస్ ల మధ్య వాగ్వాదం జరుగుతున్నప్పుడు హఠాత్తుగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగరరావు ద్రోణంరాజు వద్దకు దూసుకెళ్లారు. దీంతో గుంటూరు జిల్లా బాపట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే గాదె వెంకటరెడ్డి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఊహించని విధంగా విద్యాసాగర్ రావు… గాదె చొక్కా పట్టకున్నారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం చెరేగింది.

సర్దిచెప్పడానికి వస్తే చొక్కా పట్టుకుంటారా? అని గాదె వెంకటరెడ్డి శాసనసభలో మండిపడ్డారు. సభ్యత, సంస్కారం లేకుండా ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం సరికాదు ప్రజాప్రతినిధులకు ఉండాల్సిన సభ్యత, సంస్కారం ఇదేనా? అంటూ ప్రశ్నించారు. టీఆర్ఎస్ సభ్యుల దౌర్జన్యాలను అడ్డుకునే శక్తి సామర్థ్యాలు తమకున్నాయని గాదె అన్నారు. చొక్కా పట్టుకున్న వారితో వెంటనే క్షమాపణలు చెప్పించాలని డిమాండ్ చేశారు. దీంతో టీఆర్ఎస్ శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్ తమ సభ్యుల ప్రవర్తనకు చింతిస్తున్నామని క్షమాపణలు చెప్పారు.