హరికృష్ణ వెనుక జగన్..!!

 

hari krishna jagan, jagan chandrababu, chandrababu hari krishna

 

 

తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ హరికృష్ణ రాజీనామా వెనుక జగన్ పార్టీ నేత ఉన్నట్లు తెలుస్తోంది. రాజ్యసభ సభ్యత్వానికి గురువారం ఆయన రాజీనామా చేయడం, అంతేవేగంగా అది ఆమోదం పొందడం పార్టీవర్గాలను విస్మయంలో ముంచెత్తింది. హరికృష్ణ భావోద్వేగంతో రాజీనామా చేశారా? లేక పార్టీ అధినేత, బావ చంద్రబాబును ఇరుకునపెట్టేందుకు చేశారా? అనే చర్చ జరుగుతోంది.

 

హరికృష్ణ రాజీనామా చేస్తున్నట్లు టిడిపి నేతలెవరికీ తెలియదు..కాని ఈ విషయంపై ముందుగానె జగన్ పార్టీ నేతలకు సమాచారం అందడం విశేషం. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏమిటంటే..హరికృష్ణ రాజీనామా ను స్వయంగా జగన్ పార్టీ నేతే తాయారు చేశారట. "ప్రస్తుతం జగన్ పార్టీలో ఉన్న విజయవాడ నగరానికి చెందిన ఒక మాజీ ఎమ్మెల్యే ఏపీఎన్జీవో నేతలకు ఫోన్ చేశారు. హరికృష్ణ రాజీనామా చేయబోతున్నారని... దానిని స్వాగతించాలని కోరారు. రాజీనామా సరే, ఆది ఆమోదం పొందుతుందా? అని ఉద్యోగ నేతలు ప్రశ్నించగా... రాతకోతలన్నీ తానే చేశానని, రాజీనామా కచ్చితంగా ఆమోదం పొందుతుందని మాజీ ఎమ్మెల్యే తెలిపారు.



చంద్రబాబును పరోక్షంగా ఇరుకున పెట్టడానికే ఈ వ్యవహారం నడిపినట్లు అనిపిస్తోంది. రాజీనామా చేసి ఆమోదించుకొని చంద్రబాబుకంటే ముందే సీమాంధ్రలో పర్యటనకు వెళ్తే పార్టీ కార్యకర్తలు, నాయకులంతా తననే అనుసరిస్తారని, చంద్రబాబు కంటే తనకే ఇమేజి వస్తుందని ఆయన ఆశిస్తున్నారు.