పేలుడు పదార్థాల కేసులో కాంగ్రెస్ నేత గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అరెస్ట్

 

పేలుడు పదార్థాలు లభ్యమైన కేసులో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అరెస్ట్  పోలీసులు అరెస్ట్ చేశారు. కామారెడ్డిలోని కేపీఆర్ కాలనీలో పేలుడు పదార్థాలు లభ్యమైన కేసులో నిన్న రాత్రి 10 గంటల సమయంలో ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిజామాబాద్ జైలుకు తరలించిన పోలీసులు. ఈ కేసులో గతంలో అరెస్టయిన ముగ్గురు నిందితులు పోలీసుల విచారణలో కీలక విషయాలు వెల్లడించారు. 

తాము సేకరించిన పేలుడు పదార్థాలను చంద్రశేఖర్‌రెడ్డి వద్ద నుంచే తెచ్చినట్లు నిందితులు పోలీసులకు తెలియజేశారు. ఈ సమాచారం ఆధారంగా, పోలీసులు జూలై 3న రాత్రి గడ్డం చంద్రశేఖర్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని, నిజామాబాద్ జైలుకు తరలించారు. ఈ కేసులో చంద్రశేఖర్‌రెడ్డి సోదరుడు సూర్య కూడా నిందితుడిగా ఉన్నాడని, ప్రస్తుతం పరారీలో ఉన్న సూర్య కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కేసు తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది. 
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu