కాంగ్రెస్‌ మూడో జాబితా విడుదల.. పొన్నాల హ్యాపీ

 

తెలంగాణ కాంగ్రెస్ ఇప్పటివరకు రెండు విడుతలుగా 75 మంది అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం 119 స్థానాలకు గాను మహాకూటమి పొత్తులో భాగంగా కాంగ్రెస్ 94 స్థానాల్లో పోటీ చేస్తోంది. మిగతా 19 స్థానాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తుందా అని పార్టీ శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూసారు. అయితే తాజాగా 13 మంది అభ్యర్థులతో కాంగ్రెస్‌ మూడో జాబితాను విడుదల చేసింది. అధిష్ఠానం ఆమోద ముద్ర అనంతరం ఈ జాబితాను కాంగ్రెస్‌ ప్రకటించింది. ఈ జాబితాలో పొన్నాల లక్ష్మయ్యకు చోటు దక్కింది. తాజా జాబితాతో ఇప్పటివరకూ మొత్తం 88 మంది అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్‌ ప్రకటించింది. ఇంకా ఆరు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. ఇవాళ సాయంత్రం లేదా రేపు ఉదయం మరో జాబితాను కాంగ్రెస్‌ విడుదల చేసే అవకాశం ఉంది.

కాంగ్రెస్‌ మూడో జాబితా అభ్యర్థుల వివరాలు:

  1. భోథ్‌(ఎస్టీ)- సోయం బాపూరావు
  2. నిజామాబాద్‌ అర్బన్‌-తాహెర్‌ బిన్‌ హమ్దాన్‌
  3. నిజామాబాద్‌ రూరల్‌ - డా. రేకుల భూపతి రెడ్డి
  4. బాల్కొండ- ఈ. అనిల్‌కుమార్‌
  5. ఎల్బీనగర్‌ -డి. సుధీర్‌రెడ్డి
  6. కార్వాన్‌-ఉస్మాన్‌ బిన్‌ మహ్మద్‌ అల్‌ హజారి
  7. యాకత్‌పురా- కె. రాజేందర్‌ రాజు
  8. బహదూర్‌పుర - కలేం బాబా
  9. కొల్లాపూర్‌ - బీరం హర్షవర్ధన్‌రెడ్డి
  10. దేవరకొండ(ఎస్టీ)- బాలునాయక్‌
  11. తుంగతుర్తి(ఎస్సీ)-అద్దంకి దయాకర్‌
  12. జనగామ - పొన్నాల లక్ష్మయ్య
  13. ఇల్లందు(ఎస్టీ)- బానోత్‌ హరిప్రియ నాయక్‌