ఏపీ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల: మూడు దశల్లో పోలింగ్.!
Published on: Fri Nov 6, 2026 8:37AM
.webp)
ఆంధ్రప్రదేశ్ లో స్థానిక పోరు తదుపరి దశకు రంగం సిద్ధమైంది. ఇందులో భాగంగా గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. పల్లె సీమల్లో పొలిటికల్ హీట్ ను అమాంతంగా పెంచేసే గ్రామ పంచాయతీలకు వేర్వేరు విడతల్లో ఎన్నికలను నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది.
పంచాయతీ ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, సజావుగా పూర్తి చేసేందుకు వీలుగా మూడు దశలలో ఎన్నికల నిర్వహణకు నిర్ణయించినట్లు పేర్కొంది. ఇందు కోసం దశలవారీగా నోటిఫికేషన్లను విడుదల చేయనుంది. తాజాగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం తొలి విడత ఎన్నికల నోటిఫికేషన్ను నవంబర్ 13, రెండో విడత నోటిఫికేషన్ ను నవంబర్ 18న, ఒక మూడో విడత నోటిఫికేషన్ను నవంబర్ 19వ రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేయనుంది.
ఈ ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా పోలింగ్ సమయాలను కూడా అధికారులు ఖరారు చేశారు. ప్రతి విడత పోలింగ్ రోజున ఉదయం ఆరున్నర నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఎండ తీవ్రతను, గ్రామీణ ప్రాంతాల వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ సమయాన్ని కేటాయించినట్లు తెలుస్తోంది.
.webp)
అలాగే ఏ రోజుకారోజు పోలింగ్ ముగిసిన వెంటనే, ఓట్ల లెక్కింపు, ఆ తరువాత ఫలితాల వెల్లడి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో నాయకత్వాన్ని ఎన్నుకునే ఈ ఎన్నికల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పల్లెలు సన్నద్ధమవుతున్నాయి. గ్రామాల్లో తమ పట్టును నిలుపుకోవడానికి, స్థానిక నాయత్వాన్ని కైవసం చేసుకోవడానికి రాజకీయ పార్టీలు, స్థానిక నాయకులు ఇప్పటికే వ్యూహ, ప్రణాళికా రచనల్లో నిమగ్నమయ్యారు.
ఇది కూడా చదవండి: ఏపీ పరిషత్ ఎన్నికలు: కూటమి టార్గెట్ 94 పర్సంట్ స్ట్రైక్ రేట్.. దిశానిర్దేశం చేసిన చంద్రబాబు.!
ఈ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన వెలువడిన తరుణంలో జిల్లాల యంత్రాంగాలు కూడా అప్రమత్తమయ్యాయి. పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, బ్యాలెట్ బాక్సులు సిద్దం చేయడం, అలాగే సిబ్బందికి తగిన శిక్షణనివ్వడం వంటి ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా శాంతిభద్రతల పరిరక్షణకు క చర్యలు తీసుకుంటున్నారు.

నోటిఫికేషన్లు వెలువడే తరుణం సమీపిస్తుండటంతో పల్లెల్లో ఎన్నికల కోలాహలం మొదలైంది. నామినేషన్ల స్వీకరణ నుంచి పోలింగ్ ముగిసే వరకు ప్రతి దశలోనూ ఎన్నికల నిబంధనలు అమలవుతాయని యంత్రాంగం హెచ్చరిస్తోంది. ఈ ఎన్నికల ద్వారా గ్రామాల్లో అభివృద్ధి పనులు మరింత వేగవంతం అవుతాయని మరియు ప్రజల ఆకాంక్షలకు తగిన స్థానిక పాలన అందుతుందని స్థానికులు భావిస్తున్నారు.
మీకు నచ్చవచ్చు: ఎంపీటీసీజడ్పీటీసీ పోలింగ్ : పులివెందుల మండలం ఎర్రిపల్లిలో బాంబు దాడులు, ఉద్రిక్తత.!
మురసు తుపాను నష్టాలపై సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే.!
[AP Gram Panchayat Elections Schedule, AP Village Elections, Three Phases Polling, Panchayat Voting, Counting, Results, Telugu One]


