TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఎంపీటీసీజడ్పీటీసీ పోలింగ్ : పులివెందుల మండలం ఎర్రిపల్లిలో బాంబు దాడులు, ఉద్రిక్తత.!

Published on: Thu Nov 5, 2026 10:51AM

ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా కడప జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా పులివెందుల మండలం  ఎర్రిపల్లెలో పోలింగ్ కేంద్రం వద్ద ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలు హింసాత్మకంగా మారాయి.  ఎర్రిపల్లెలోని పోలింగ్ కేంద్రం వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్న  వైసీపీ శ్రేణులు బూత్‌లోకి వెళ్లేందుకు యత్నించగా, అక్కడ విధుల్లో ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు.   

కాగా అదే పోలింగ్ కేంద్రం వద్ద ఉన్న తెలుగుదేశం  శ్రేణులకు, వైసీపీ కార్యకర్తలకు  వాగ్వాదం చెలరేగింది. క్షణాల వ్యవధిలో ఈ వివాదం  ముదిరి ఇరు వర్గాలు పరస్పరం దాడులకు దిగాయి. ఈ ఘర్షణ సందర్భంగా పెట్రోలు బాంబులతో దాడి జరిగింది.

అలాగే  వైసీపీ, తెలుగుదేశం వర్గాలు పరస్పరం రాళ్ల దాడులకూ పల్పడ్డారు.  దీంతో ఓటు వేయడానికి వచ్చిన జనం భయ భ్రాంతులకు గురై పరుగులు తీశారు.  పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలనూ చెదరగొట్టారు. ఇటువంటి ఘటన పునరావృతం కాకుండా ఎర్రిపల్లి పోలింగ్ కేంద్రం వద్ద అదనపు బలగాలను మోహరించారు.   

[Petrol Bomb Attack in Erripalle, Pulivendula Mandal,  AP Local Body Elections Violence, TDP YCP Clash, Pulivendula Polling Tension, Telugu One]