ఆల్‌ఖైదా నేత ఖతాని మృతి..

 

ఆల్‌ఖైదా నేత ఆల్‌ ఖతాని హతమైనట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని అమెరికా స్వయంగా ప్రకటించింది. అక్టోబరు 23న అమెరికా భద్రతా దళాలు జరిపిన దాడిలో ఆల్‌ఖైదా నేత ఫరూక్‌ ఆల్‌ ఖతాని మృతి చెందినట్లు అమెరికా ప్రకటిచింది. ఆఫ్ఘనిస్థాన్‌లోని కునార్‌లో అమెరికా భద్రతాదళాలు, తీవ్రవాదుల మధ్య జరిగిన దాడుల్లో ఆల్‌ఖైదా కీలక నేత ఖతాని హతమైనట్లు పెంటగాన్‌ ప్రెస్‌ సెక్రటరీ పీటర్‌ కుక్‌ తెలిపారు. తూర్పు ఆఫ్ఘన్‌లో ఆల్‌ఖైదాకు ఖతాని నాయకత్వం వహిస్తున్నట్లు వెల్లడించారు. అంతేకాదు తీవ్రవాద నాయకుడు బిలాల్‌ ఆల్‌ ఉతాబి కోసం గాలింపు చేపట్టినట్లు చెప్పారు.