ఆర్‌బీఐ ఎదుట సీఎం ధర్నా

 

కేంద్రం పెద్ద నోట్లు రద్దు చేసిన నేపథ్యంలో అందరూ తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. సామాన్య ప్రజల నుండి ప్రముఖుల వరకూ అందరూ ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కేరళ ముఖ్యమంత్రి కూడా ఆఖరికి ధర్నాకు దిగాల్సిన పరిస్థితి వచ్చింది. సహకార బ్యాంకుల్లో రూ.500, రూ.1000 నోట్లను తీసుకునే వెసులుబాటును రద్దు చేసిన కేంద్ర నిర్ణయానికి నిరసనగా సీఎం తిరువనంతపురంలోని ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయం ఎదుట ధర్నాకు చేపట్టారు. ‘కేరళ సహకార రంగం నల్లధనానికి నిలయం కాదు. సహకార రంగ బ్యాంకులను నాశనం చేయడం వల్ల దాని ప్రభావం కేరళ ఆర్థిక వ్యవస్థపై పడుతుంది. సహకార బ్యాంకుల్లో పాత నోట్లను తీసుకోవాలి’ అని ఆయన డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్ తో పాటు ఈ దర్నాలో పలువురు రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు.