మద్యం మత్తులో వైసీపీ నేత అరాచకం.. మహిళపై దాడి..
posted on Mar 30, 2021 @ 10:46AM
ఎవరైనా పక్కవారిపైనా దాడులు చేయాలంటే కారణం వెతుకుంటారు. వీళ్ళు వీరంగం చేయాలంటే మాత్రం కారణాలు లేకుండానే కత్తి దుస్తరూ.. ప్రజలమీదికి చేతులెత్తుతారు. అక్కడ వల్లే పోలీస్ వల్లే చట్టం. ఏపీలో వైసీపీ నాయకులు కార్యకర్తలు చేయని గందరగోళం లేదు.. సృష్టించని బీభత్సము లేదు.. తాజాగా ఒక వైసీపీ కార్యకర్త మద్యం మత్తులో మహిళపై దాడికి చేశాడు. వారి చెప్పిందే వేదం. కాదని వాదిస్తే వాదం. వారికి నచ్చితే ఆకాశానికి ఎత్తుతారు. నచ్చకపోతే పాతాళానికి తొక్కుతారు. వాడు దాడి చేయాలనుకుంటే కారణాలు వెతుకోరు మనుషులను వెతుకుంటారు. అది మహిళలే మగాలైన సరే వారి పిడిగుడ్డులు, కత్తి వేటు పడాల్సిందే. ఏపీలో వాళ్ళు సృష్టించని బీభత్సము అంటూ లేదు. అది కాక ఇప్పుడు కొత్తగా కారణాలు లేకుండా మద్యం మత్తులో మహిళలపై దాడులు చేయడం వారికే చెల్లింది.
కర్నూలు జిల్లాలోని జూపాడుబంగ్లా మండలం తరిగోపుల గ్రామంలో దారుణం జరిగింది. మద్యం మత్తులో వైసీపీ కార్యకర్త వీరంగం సృష్టించాడు. పీకల్లోతు తాగిన మద్దిలేటి ఒక మహిళపై దాడికి తెగబడ్డాడు. ఈ దాడిలో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఆ మహిళను దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు స్థానికులు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఇంకా ఎలాంటి సమాచారం అందలేదు.
ఈ ఘటనతో వైసీపీ కార్యకర్త, నేతలపై స్థానికులు నిప్పులు చెరుగుతున్నారు. ఎలాంటి కారణం లేకుండా దాడికి దిగడమేంటి..? అంటూ కన్నెర్రజేస్తున్నారు. మద్దిలేటిని పోలీసులు కఠినంగా శిక్షించాలని, బాధితురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.