కళా తపస్వి విశ్వనాథ్ కు వైయస్ఆర్ లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డు
posted on Oct 14, 2022 @ 8:17PM
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వైయస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్, వైయస్ఆర్ అచీవ్‌మెంట్ అవార్డులను ప్రకటించింది. వివిధ విభాగాలలో మొత్తం 30మందికి ఈ అవార్డులను ప్రకటించింది. కళలు, సంస్కృతి విభాగంలో కళాతపస్వి కె. విశ్వనాథ్, ఆర్ నారాయణ మూర్తిలకు వైయస్ఆర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును ప్రకటించింది.
అలాగే రంగస్థల కళాకారుడు నాయుడు గోపి, కలంకారీ కళాకారుడు పిచుక శ్రీనివాస్, షేక్ గౌసియా బేగంలకు కూడా ఈ అవార్డు ప్రకటించారు. అలాగే సాహిత్య సేవ విభాగంలో విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, ఎమెస్కో ప్రచురణాలయం, రచయిత డాక్టర్ శాంతినారాయణకు, వ్యవసాయ విభాగంలో ఆదివాసీ కేష్యూనట్ ఫార్మర్స్ కంపెనీ సోడెం ముక్కయ్య, కుశలవ కుశలవ కోకోనట్ ఫార్మర్స్ కంపెనీ యజమాని ఎ. గోపాలకృష్ణ,అన్నమయ్య మ్యూచువల్లీ ఎయిడెడ్ కో ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ కు చెందిన జయబ్బ నాయుడు, అమృతఫల ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ ఓనర్ కె.ఎల్.ఎన్. మౌక్తిక, కట్టమంచి బాలకృష్ణారెడ్డిలకు ఈ అవార్డును ప్రకటించింది.
ఇక మహిళా సాధికారత, రక్షణ విభాగంలో వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డులను ప్రజ్వల ఫౌండేషన్ కు చెందిన సునీతా కృష్ణన్, శిరీషా రీహేబిలిటేషన్ సెంటర్, దిశ పోలీసింగ్ లకు ఇచ్చింది. మూడో అవార్డును దిశ – పోలీసింగ్‌కు అలాగే వైయస్ అచీవ్‌మెంట్ అవార్డులను రవాడ జయంతి, ఎస్వీవీ లక్ష్మీనారాయణ, రాయుడు సుబ్రహ్మణ్యం, హజ్రతయ్య, పి. శ్రీనివాసులులకు సంయుక్తంగా ప్రకటించింది ఏపీ సర్కార్. అలాగే విద్యారంగంలో మదనపల్లి రుషి వ్యాలీ, కావలి జవహర్ భారతి విద్యా సంస్థలకు, వ్యక్తిత్వ వికాసం విభాగంలో బీవీ పట్టాభిరామ్ కు ఈ అవార్డు ప్రకటించింది.
మీడియా రంగంలో భండారు శ్రీనివాసరావు, సతీష్ చందర్, మంగు రాజగోపాల్, ఎంఈవీ ప్రసాదరెడ్డిలకు, వైద్య రంగంలో డాక్టర్ బి. నాగేశ్వరరెడ్డి, డాక్టర్ వరప్రసాదరెడ్డి, ప్రతాప్ సి రెడ్డి, గుళ్ళపల్లి నాగేశ్వరరావులకు వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డులను ప్రకటించింది. గ్రంధి మల్లికార్జున రావుకు లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు ప్రకటించింది. వీరందరికీ ఈ పురస్కారాలను సీఎం జగన్ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున అంటే నవంబర్ 1న ప్రదానం చేస్తారు.