కడపలో షర్మిలని గెలిపించండి: విజయమ్మ పిలుపు
posted on May 11, 2024 @ 3:41PM
కడప పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న షర్మిలను గెలిపించాలని ఆమె తల్లి విజయమ్మ పిలుపు ఇచ్చారు. ఈ మేరకు ఆమె అమెరికా నుంచి ఒక వీడియో విడుదల చేశారు. ‘‘నేను మీ విజయమ్మను. రాజశేఖరరెడ్డిని అభిమానించేవారికి, రాజశేఖరరెడ్డిని ప్రేమించే వారికి, యావత్ కడప లోక్‌సభ నియోజకవర్గ ప్రజలందరికీ నా నమస్కారాలు. రాజశేఖరరెడ్డిని మీరు ఏ రకంగా అభిమానించారో, ఏ విధంగా అక్కున చేర్చుకున్నారో, ఏ విధంగా నిలబెట్టుకున్నారో.. ఆయనకు ఊపిరి ఉన్నంతవరకు ప్రజాసేవలో మీకే అంకితం అయ్యారు. మీకు సేవ చేస్తూనే ఆయన చనిపోయారు. ఈరోజు ఆయన ముద్దుబిడ్డ షర్మిలమ్మ పార్లమెంటుకు కంటెస్ట్ చేస్తా వుంది. ఈరోజు ఆ బిడ్డను ఆశీర్వదించమని, పార్లమెంటుకు పంపమని, ఆయనలాగా మీకు సేవ చేసే అవకాశం ఇవ్వమని మిమ్మల్నందర్నీ ప్రార్థిస్తున్నాను’’ అని ఆ వీడియోలో విజయమ్మ చెప్పారు.
ఇది నిజంగానే ఏపీ రాజకీయాలలో ఒక సంచలనమైన విషయం, నువ్వు ఇస్తే నాకు మద్దతు ఇవ్వాలి, లేకపోతే షర్మిలకు మాత్రం ఇవ్వకూడదు అని జగన్ బెదిరించినప్పటికీ, అమెరికా వెళ్ళిపోయేలా చేసినప్పటికీ విజయమ్మ ఇలా కీలక సమయంలో షర్మిలకు ఓటు వేయాలని పిలుపు ఇవ్వడం జగన్‌కి పెద్ద షాకే. ఇప్పటికే ఎన్నో చిక్కుల్లో వున్న జగన్ మీద ఇప్పుడు విజయమ్మ రూపంలో మరో చిక్కు వచ్చి పడింది.