జగన్ మెంటలెక్కిపోతుందా..?
posted on Feb 12, 2024 @ 3:03PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రస్తుత పరిస్థితి తలుపు సందులో పడి నలిగిపోయిన చందంగా ఉందనే ఓ చర్చ అయితే పోలిటికల్ సర్కిల్‌లో వైరల్ అవుతోంది. వైయస్ జగన్ పాలనపై ఓ వైపు సొంత సోదరి, పీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధిస్తుంటే.. మరోవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. రెడ్ బుక్ పేరు ప్రస్తావిస్తూ వస్తున్నారు. దీంతో ఫ్యాన్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారనే ఓ చర్చ అయితే సదరు సర్కిల్‌లో హల్‌చల్ చేస్తోంది.
అయితే నారా లోకేశ్.. సీఎం వైయస్ జగన్‌పై ఆరోపణలు గుప్పిస్తూనే.. జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న ఉన్నతాధికారుల పేర్లు.. రెడ్ బుక్‌లో నమోదు చేస్తున్నామని.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వారి పని పడతామంటూ... వివిధ సభల్లో ప్రకటిస్తు వస్తున్నారని.. కానీ వైయస్ షర్మిల అలా కాదని.. ఎప్పుడు, ఎక్కడ, ఏ సభ జరిగినా.. అందులో ముఖ్యమంత్రి వైయస్ జగన్ వ్యవహరశైలిపైనే కాకుండా అతడి పాలనా వైఖరిపై నిప్పులు చెరుగుతోందని... ఇంకా క్లారిటీగా చెప్పాలంటే బాపట్లలో జరిగిన సభలో ఆమె చేసిన విమర్శలపై స్థానిక ఎమ్మెల్యే కోన రఘుపతి ప్రెస్ మీట్ పెట్టి స్పందించడం... అందుకు ప్రతీగా వైయస్ షర్మిల.. అతడికి సైతం తనదైన శైలిలో కౌంటర్ ఇవ్వడం..
అలాగే ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగరిలో ఏర్పాటు చేసిన సభలో సైతం స్థానిక ఎమ్మెల్యే ఆర్కే రోజాపై మండిపడడం.. ఇలా వైయస్ షర్మిల.. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో పర్యటిస్తే.. అక్కడి స్థానిక ఎమ్మెల్యేతోపాటు.. ముఖ్యమంత్రి వైయస్ జగన్‌పై మండిపడడం.. అలాగే రాష్ట్రంలో నాయకులంతా.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి గులాంగిరి చేస్తున్నారంటూ విమర్శించడం.. అదే విధంగా ఈ నాలుగేళ్లలో వైయస్ జగన్ ప్రభుత్వం పట్టించుకోని పలు కీలక అంశాలు వైయస్ షర్మిల తెరపైకి తీసుకు రావడం..
అందులో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపడం తదితర అంశాలను మళ్లీ ప్రజల ముందుకు తీసుకు రావడం.. రాష్ట్రానికి సంబంధించిన ఈ అంశాలను జగన్ ప్రభుత్వం అటకెక్కించిందని.. అలాంటి వేళ.... రాష్ట్రానికి మేలు జరగాలంటే.. జగన్ ప్రభుత్వాన్ని గద్దెదించాలంటూ ప్రజలకు విజ్జప్తి చేయడం.. ఇక పచ్చిగా చెప్పాలంటే.. ఏం పీక్కుంటారో.. పీక్కోండంటూ జగన్ అండ్ కోకి సవాల్ విసురడం... ఆ క్రమంలో వైయస్ షర్మిలకు కౌంటర్ ఇచ్చేందుకు.. జగన్ ప్రభుత్వంలోని పెద్దలు సైతం వెనకాడుతోందనే ఓ ప్రచారం అయితే సదరు సర్కిల్‌లో కొన... సాగుతోంది.
అదీకాక... వైయస్ షర్మిల చేసిన ఇవే ఆరోపణలు ఇప్పటికే మరోకరు కానీ చేసి ఉంటే.. ఈపాటికే వారిపై నాని బ్రదర్స్, అంబటి రాంబాబు, ఆర్కే రోజా, జోగి రమేష్, ఎక్సెట్రా ఎక్సెట్రాలు.. మీడియా ముందుకు వచ్చి విరుచుకు పడిపోయేవారని.. కానీ వైయస్ జగన్‌కి వైయస్ షర్మిల సోదరి కావడంతో.. వారంతా మిన్నకుండి పోయారని.. అయితే.. తొలుత జగన్ పార్టీ నాయకులు వైయస్ షర్మిలను లక్ష్యంగా చేసుకొని.. విమర్శలు గుప్పిస్తుంటే.. వైయస్ రాజశేఖరరెడ్డి ఆత్మ కేవీపీ రామచంద్రరావు లాంటి వాళ్లు.. మీడియా ముందుకు వచ్చి.. వైయస్ జగన్ వైఖరిని ఇప్పికే తూర్పారపట్టారని.. అలాంటి వేళ వైయస్ షర్మిలపై వారంతా విమర్శల బాణాలు సంధించకుండా ఉండిపోయారని.. లేకుంటే వీరంతా ఎప్పుడో రంగంలోకి దిగి.. జగనన్న కళ్లలో ఆనందం కోనం... బూతులతో రెచ్చిపోయేవారని చర్చ సైతం సర్కిల్‌లో నడుస్తోంది.
వైయస్ షర్మిలపై విమర్శలు గుప్పిస్తుంటే.. తండ్రి వైయస్ఆర్ ఆత్మ కేవీపీ రామచంద్రరావే కాదు... పార్టీలకు అతీతంగానే అందరు స్పందిస్తున్నారని.. అలాగే ప్రజలు సైతం తీవ్రంగా పరిగణిస్తున్నారని..దీంతో వైయస్ జగన్ ఓ విధంగా పరిస్థితిని కక్కలేక మింగలేక అన్న చందంగా వ్యవహరిస్తూ.. తనలో తానే.. లోలోపల కుమిలి పోతున్నారని ఓ ప్రచారం అయితే పోలిటికల్ సర్కల్‌లో వైరల్ అవుతోంది.