ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో వై.ఎస్.భారతి పాత్ర... ఆనం
posted on Aug 28, 2022 @ 6:06PM
ఎంత దాచినా దాగని సత్యాలూ ఉంటాయి. పైకి ఎంత గంభీరంగా ఉన్నా చేసిన తప్పులు ఏదో ఒక రూపంలో బయటపడకా తప్ప దు. గోడమీద పెద్ద నీడ దగ్గరకి వెళితే చిన్నదవుతుంది. పెద్ద పదవుల్లోనో, పెద్ద స్థాయిల్లోనో ఉన్నామని తమను ఎవరూ పట్టిం చుకోరన్న ధైర్యంతో చేసే దుర్మార్గం బయటపడకా తప్పదు. దేశంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ ప్రకంపనలు సృష్టిస్తోంది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ లింకులు బయటపడుతున్నాయి. తాజాగా ఏపీ సీఎం జగన్ సతీమణి వై.ఎస్. భారతి పాత్ర ఉందన్న గుట్టు బయటపడింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతి , ఎంపి విజయసాయిరెడ్డిల పాత్ర ఉందని టిడిపి నేత ఆనం వెంకట రమణా రెడ్డి ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, విజయసాయిరెడ్డితో ఆర్థిక సంబంధా లున్న పనాక శరత్ రెడ్డిని, ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీబీఐ విచారిస్తోందన్నారు.
తన లావాదేవీల కోసమే జగన్ దావోస్ వెళ్లారు. ఢిల్లీ నుంచి తాడేపల్లి వరకు లిక్కర్ స్కామ్ జరుగుతోంది. ఆదాన్ అనే డిస్టిలరీ స్థాపించి ఎంపీ విజయసాయిరెడ్డి స్కామ్‌లు చేస్తున్నారు. ఢిల్లీలో తీగ లాగితే తాడేపల్లి ప్యాలెస్ పునాదులు కదులుతున్నాయి. జగతి పబ్లికేషన్స్‌కు, ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్‌కు ఆర్థిక సంబంధాలు న్నా యి. క్విడ్ ప్రోకో-1లో జగతి పబ్లికేషన్స్‌కు ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ కోట్లు మళ్లించిందని ఆయన ఆరోపించారు. అదాన్ డిస్టిలరీస్ ద్వారా అక్ర మంగా సంపాదించిన రూ.5 వేల కోట్ల సొమ్ము ను ఢిల్లీ స్కామ్‌లో ఉపయోగించినట్లు చెప్పారు.
హైదరాబాదులో 19 కంపెనీలు ఒకే చిరునామాతో ఉన్నాయని వెంకటరమణారెడ్డి తెలిపారు. ఆయా కంపెనీల్లో విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్ డైరెక్టర్ గా ఉన్నాడని వెల్లడించారు. అవి జగన్, విజయసాయిల సూట్ కేసు కంపెనీలేనని ఆనం ఆరోపించారు. రోహిత్ కంపెనీలో అదాన్ డిస్టిలరీస్ డైరెక్టర్ శ్రీనివాస్ కూడా ఉన్నారని పేర్కొన్నారు. 2019లో అదాన్ డిస్టిలరీకి ఎవరు అనుమ తిచ్చారని ఆనం వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు. రెండున్నరేళ్లలో రూ.2,400 కోట్ల మద్యం ఎలా అమ్మారని నిలదీశారు.
ప్రభుత్వంపై టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి విమర్శలు గుప్పించారు. ఢిల్లీ నుంచి తాడేపల్లి వరకు లిక్కర్ స్కామ్ జరుగు తోందని ఆరోపించారు. ఆదాన్ అనే డిస్టిలరీ స్థాపించి ఎంపీ విజయసాయిరెడ్డి స్కామ్లు చేస్తున్నారని విమర్శించారు. జగతి పబ్లి కేషన్స్‌కు, ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్‌కు ఆర్థిక సంబం ధాలున్నాయని ఆరోపించారు. క్విడ్ ప్రోకో-1లో జగతి పబ్లికేషన్స్‌కు ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ కోట్లు మళ్లించిందన్నారు. విజయ సాయి రెడ్డితో ఆర్థిక సంబంధాలున్న పనాక శరత్‌రెడ్డిని, ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీబీఐ విచారిస్తోందని తెలిపారు. తన లావాదేవీల కోసమే జగన్ దావోస్ వెళ్లారని పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో వైఎస్ భారతి విజయసాయిరెడ్డిల పాత్ర ఉందని ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించారు