ఇప్పుడు ఈ డైలాగ్స్ అవసరమా రోజమ్మా..
posted on Oct 13, 2015 @ 5:03PM
ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ వైకాపా పార్టీ అధినేత జగన్ తలపెట్టిన నిరాహార దీక్షను ఏపీ ప్రభుత్వం ఈ రోజు తెల్లవారుజామున భగ్నం చేసింది. జగన్ దీక్ష తలపెట్టి ఈ రోజుకి ఏడు రోజులు కావడంతో.. అందులోనూ జగన్ దీక్షను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పార్టీ సీనియర్ నాయకులు అంతా కలిసి ఏదో ఒక రకంగా దీక్షను విరమించాలని అనుకున్నారు. కానీ ఈలోగా ప్రభుత్వం చొరవ తీసుకొని దీక్షను భగ్నం చేసింది. అయితే దీక్షను భగ్నం చేసినందుకు పార్టీ నేతలు ఊపిరి పీల్చుకొని..సంతోషపడుతున్నా ఏదో పైపైకి మాత్రం బలవంతంగా దీక్షను విరమింపజేశారు అని మాటలు చెపుతున్నట్టు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
అయితే అందరి సంగతి ఎలా ఉన్నా ఆపార్టీలో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న రోజాని మాత్రం రోజా సంతోషం వచ్చినా తిడుతుంది అని అందరూ అనుకుంటున్నారు. జగన్ దీక్షను ప్రభుత్వం విరమించినందుకు గాను చంద్రబాబు అత్యంత అప్రజాస్వామికంగా జగన్ దీక్షను భగ్నం చేశారని.. దీక్ష భగ్నం చేసినంతమాత్రాన తమ పోరాటాన్ని ఆపలేరని హెచ్చరించారు. నిన్న మొన్నటి వరకూ జగన్ చేస్తున్న దీక్షను విమర్శిస్తూ ఇప్పుడు దొంగ దారిన దీక్షను విరమిస్తారా అని తెగ ఫైర్ అవుతుంది. ప్రత్యేక హోదాకోసం టీడీపీ ప్రభుత్వం పై పోరాటం చేస్తూనే ఉంటామని అన్నారు. అయితే రోజా చేసిన వ్యాఖ్యలను టీడీపీ నేతలు సీరియస్ గా తీసుకోకపోగా.. తమ నాయకుడిని బతికించారన్న సంతోషంలో రోజా ఇలా మాట్లాడుతుందని అనుకుంటున్నారు. ఇంకొంత మందైతే ఇప్పుడు ఈ డైలాగ్స్ అవసరమా అని కూడా అనుకుంటున్నారు.