వైసీపీ ఆఫీసు బిల్డింగ్ కూల్చివేత – నిజాలు
posted on Jun 22, 2024 @ 6:01PM
• డొక్కా మాణిక్య వర ప్రసాద్ 05.01.2023న తాడేపల్లి సర్వే నెం. 202/A బోట్ యార్డు స్థలం వైసీపీ ఆఫీసుకు కేటాయించాలని దరఖాస్తు చేశారు.
• తెనాలి సబ్ కలెక్టర్ 01.02.2023న ప్రపోజల్ పంపిస్తూ సి.ఆర్.డి.ఏ వారు 5.35 ఎకరాలు సీడ్ యాక్సస్ రోడ్డు కోసం మార్కింగ్ చేశారని ఈ భూమిని కేటాయించాలంటే ఇరిగేషన్ శాఖ అనుమతి కావాలని నివేదించారు.
• సిసిఎల్ఎ 02.02.2023నే దానిని ప్రభుత్వానికి సిఫారసు చేశారు. 07.02.2023వ తేదిన ఇరిగేషన్ శాఖ అనుమతులు తీసుకోకుండానే దీనిని కేబినెట్ లో పెట్టి ఆమోదం తీసుకున్నారు.
• 16.02.2023న జిఓ నెం. 52 విడుదల చేస్తూ "ఇరిగేషన్ శాఖ అనుమతి తీసుకోవాలని" అంతకుముందే వైసీపీ ఆఫీసు కోసం కొరిటపాడులో ఇచ్చిన 98 సెంట్ల స్థలాన్ని (జిఓ నెం. 362, తేది. 18.05.2022) వెనకకు తీసుకోవాలని నిర్దేశించారు.
• అప్పటికే 02.02.2023న ఇరిగేషన్ శాఖ ఛీప్ ఇంజినీర్ శ్రీ సి. నారాయణ రెడ్డి ప్రభుత్వానికి లేఖ రాస్తూ సర్వే నెం. 202/A లోని బోటు యార్డ్ స్థలం పార్టీ ఆఫీసులకు ఇవ్వడం సుప్రీంకోర్టు గతంలో ఇచ్చి తీర్పులకు విరుద్ధమని, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో సచివాలయం కోసం ఇటువంటి స్థలాన్ని ఇచ్చిన కేసు ఇంకా విచారణలో ఉందని దానిని ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పారు. ఆయన తన నివేదికలో ఆ సర్వే నంబర్లోని మొత్తం స్థలం 19 ఎకరాలు అని అందులో 9 ఎకరాలలో కాలవ పారుతుందని మరొక 5 ఎకరాలు అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్డుకి రెవెన్యు శాఖ కోరిందని మూడు ఎకరాలు మాత్రమే మిగిలిందని అది కూడా నది తీర ప్రాంతమని తెలియజేశారు. ఆ మిగిలిన స్థలంలో ఇరిగేషన్ శాఖ తరఫున శిక్షణ మరియు పరిశోధనా కేంద్రాన్ని నెలకొల్పుతున్నామని కావున వైసీపీ పార్టీ ఆఫీసుకు ఇవ్వడం సాధ్యం కాదని చెప్పారు.
• ఈ లెటర్ ను ఊటంకిస్తూనే పార్టీ ఆఫీసుకు స్థలాన్ని కేటాయించడం ఆ జిఓలోనే ఇరిగేషన్ శాఖ అనుమతి తీసుకోవాలని నిర్దేశించడం అప్పటి ప్రభుత్వ పెద్దల ఒత్తిడిని ఎత్తి చూపుతుంది.
• జిఓను అనుసరించి ఇరిగేషన్ శాఖ అనుమతులను తీసుకోవాల్సిన సిసిఎల్ఎ గానీ, కలెక్టర్ గానీ ఆ విషయాన్ని పట్టించుకోకుండా తాహశీల్దార్‌కు ఎండార్స్.మెంట్ ఇచ్చి చేతులు దులుపుకున్నారు. తాహశీల్దార్ గారు 31.03.2023న స్థలాన్ని ఇరిగేషన్ అనుమతి లేకుండానే వైసీపీ పార్టీకి అప్పగించేశారు.
• భవన నిర్మాణానికి సి.ఆర్.డి.ఏ నుంచి ఏ విధమైన అనుమతులు లేకుండానే మొదలు పెట్టి కొనసాగించారు. ఇరిగేషన్ శాఖ అనుమతి తీసుకోనందున భూమి కొరకు ఏ విధమైన లీజు ఒప్పందం కూడా కుదుర్చుకోలేదు. ఇది పూర్తి అధికార దుర్వినియోగం.
• దీనిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు, సమాచార హక్కు చట్టం క్రింద దరఖాస్తులు ప్రజలు దాఖలు చేశారు. ఆ ఒత్తిడికి తలొగ్గి తాడేపల్లి మున్సిపల్ కార్పోరేషన్ వారు 20.05.2024న వైసీపీ పార్టీ వారికి షోకాజ్ నోటీసు ఇస్తూ ఇరిగేషన్ శాఖ అనుమతులు తీసుకోవాలని కోరారు.
• వైసీపీ సమాధానం రాకపోవడం వల్ల తిరిగి 01.06.2024న మరొక సారి నోటీసులు జారీ చేశారు. అంటే కౌంటింగ్ తేది. 04.06.2024కు ముందే ఇది జరిగింది. సమాధానం వైసీపీ ఇవ్వలేదు.
• ఈ నేపథ్యంలో 14.06.2024న కూల్చివేత ఉత్తర్వులను తాడేపల్లి మున్సిపల్ కమీషనర్ వారు జారీ చేశారు.
• కోర్టుకు సమర్పించిన పత్రాల ప్రకారం 10.06.2024న నోటీసు ఇస్తూ భవనం నిర్మిస్తున్న రాంకీ ఇన్ ఫ్రా సంస్థ మరియు వైసీపీ పార్టీ వారికి కూల్పివేత నోటీసులు ఇవ్వడం జరిగింది. 20.06.2024 వరకు సమాధానం రాలేదు.
• వైసీపీ 21.06.2024న హైకోర్టులో వేసిన కేసులో చట్టబద్దంగా చర్యలు తీసుకోవాలని కోర్టు సూచించింది. అప్పటికే అనేక సార్లు అవకాశం ఇచ్చినా సమాధానం లేనందున 22.06.2024న అధికారులు నిర్మాణంలో ఉన్న ఈ భవనాన్ని కూల్చి వేశారు. సి. ఆర్.డి.ఏ చట్టం సెక్షన్ 115 ప్రకారం అక్రమ నిర్మాణాలను కూల్చి వేసే హక్కు సి.ఆర్.డి.ఏ అధికారులకు ఉంది. సెక్షన్ 114 ప్రకారం ఈ అక్రమ నిర్మాణాలను కొనసాగించిన వారిపై చట్టం ప్రకారం చర్యలు తీసుకుని మూడేళ్ళు జైలు శిక్ష విధించడానికి కూడా చట్టం అవకాశం కల్పించబడింది.