గన్నవరం ఎయిర్ పోర్ట్ లో వైసీపీ నేత వీరంగం
posted on Nov 1, 2022 @ 12:50PM
గన్నవరం విమానాశ్రయంలో పోలీసు అధికారులపై వైసీపీ నేత బెదిరింపులకు దిగిన వైనం మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఎయిర్ పోర్టు లోపలికి తనను పంపించలేదని వైసీపీ జెడ్ పీ కో ఆప్షన్ సభ్యుడు ఎం.డి. గౌసాని ఇష్టం వచ్చినట్లు వీరంగం వేశారు. ‘ఏంటి నువ్వు..? ఏం చేస్తావ్..?’ ‘నీ యవ్వారం ఏంటో తేల్చేస్తానం’టూ ఆయన రంకెలు వేస్తూ ఎయిర్ పోర్ట్ ఏసీపీ మీది మీదికి వచ్చారు.
‘నన్ను లోపలికి పంపలేదంటే మీ ఉద్యోగాలు ఉండవు’ అంటూ విమానాశ్రయం పోలీసు అధికారులను గౌసాని భయభ్రాంతులకి గురిచేశారు. ‘అనుమతి ఉన్న వారిని మాత్రమే విమానాశ్రయం లోపలికి పంపిస్తాం’ అని చెప్పినా వైసీపీ నేత ఎం.డి.గౌసాని వినిపించుకోలేదు.
సరికదా పోలీసులకు వేలు చూపించి మరీ బెదిరింపులకు పాల్పడ్డారు. ‘ఏంటి నువ్వు చేసేది. నిన్ను ట్రాన్స్ ఫర్ చేయించకపోతే చూడు’. ‘ఎయిర్ పోర్ట్ లోపలికి తనను పంపించకపోతే గంటలో ఇక్కడ నుండి ట్రాన్స్ ఫర్ అవుతావు’ అని అని గౌసానియా బెదిరింపులకు దిగారు.