పంచాయతీ అరాచకాలకు అంతే లేదా.. ?
posted on Feb 17, 2021 @ 2:31PM
ఏపీ పంచాయతీ ఎన్నికల్లో అధికారపు పార్టీ ఆగడాలు పతాకస్థాయిలో పెరుగుతున్నాయి.. స్వేచ్ఛ యుతంగా జరగాల్సిన ఎన్నికలను నిత్యం దాడులు, డబ్బు,మద్యం, అక్రమ ఏకగ్రీవాలతో పెచ్చు రేగుతున్నాయి.. ఇప్పటికే అధికార పార్టీ పై ఎన్ని విమర్శలు వచ్చిన వారు మాత్రం వారి విధానాలను మార్చుకోకపోవడం అధికార పార్టీ . తమ పట్టు కోల్పోయి ఓడిపోతామేమో అనుకున్న కొన్ని చోట్ల కొత్తగా అభ్యర్థులపై దాడులు చేస్తూ గృహనిర్భనాదాలు చేస్తున్నారు.. రక్షక భటులు అధికార పార్టీకి బంట్లుగా పనిచేస్తూ వారి మోచేతి నీళ్లు తాగుతున్నారు..
అదే తరహాలో శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం, టీడీపీ అభ్యర్థి గండి రామానాయుడును పోలీసులు గృహ నిర్బంధం చేసి వైసీపీ అభ్యర్థి విశ్వేశ్వరరావును పోలింగ్ కేంద్రానికి అనుమతించడంతో పోలీసుల తీరుపై గ్రామస్తులు మండిపడ్డారు. అయితే జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకే రామానాయుడును గృహ నిర్బంధం చేసినట్లు పోలీసులు తెలియజేశారు. దీంతో అంపిలి గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో పోలీసులు, గ్రామస్తుల మధ్య తోపులాట జరిగింది.
విజయ వాడ నగర కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా వైసీపీ నాయకులు 60ఏళ్ల మహిళా అని చూడకుండా దాడికి పాల్పడ్డారు.. మూడో డివిజన్ టీడీపీ అభ్యర్థి వాణి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తుండగా ఆమెపై దుండగులు దాడి చేశారు. వాణితోపాటు ఆమె కొడుకుపై దాడి చేసి ఇంట్లో సామానులు ధ్వంసం చేశారు. అవినాష్‌కు వ్యతిరేకంగా పోటీ చేస్తే ఊరుకోం అంటూ హెచ్చరిస్తూ. వైసీపీ కార్యకర్త తనపై దాడి చేశారని వాణి ఆరోపించారు. వైసీపీ నాయకులు ఆగడాలకు ఈ ఘటనే నిదర్శనమని అన్నారు. మహిళ అని కూడా చూడకుండా కొడతారా? అంటూ ఆమె వాపోయారు. పోలీసులు స్పందించి న్యాయం చేయాలని కోరారు. ఏమైనా ఊరకుక్కల బెదిరింపులకు భయపడేదిలేదని అన్నారు. దాడి ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు.
అనంతపురం రూరల్ మండలం పరిధిలోని రాచానపల్లిలో మూడో విడతలో భాగంగా పోలింగ్ జరుగుతోంది. వైసీపీ మద్దతుదారులు గెలువడానికి వీలుగా దొంగ ఓట్లు వేయించడానికి వైసీపీ నాయకులు ప్రయత్నాలు చేశారు. అయితే ఇది గమనించిన టీడీపీ కార్యకర్తలు దొంగ ఓట్లను వేయించే ప్రయత్నాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. వాగ్వాదం తీవ్ర స్థాయిలో జరిగింది. పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతుండడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు.
ఎన్నికలను రాజకీయ నాయకులు నోట్ల రాజకీయం మారుస్తున్నారని. రాజ్యాంగ విరుద్ధమే కాక బెదిరింపులు .. గృహ నిర్బంధాలు జరగడం నీతి లేని రాజకీయాలు చేస్తున్నారని ప్రజలు, ప్రత్యర్థి అభ్యర్థులు ఆవేదనలు వ్యక్తం చేస్తున్నారు..