ఘనంగా ప్రారంభమైన యాదగిరీశుడి బ్రహ్మోత్సవాలు
posted on Mar 15, 2013 @ 11:59AM
యాదగిరి గుట్ట క్షేత్రంలో కొలువై ఉన్న లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. వేదమంత్రాలు, మంగళవాద్యాల నడుమ.. దివ్యమనోహరంగా అలంకరించిన లక్ష్మీనారసింహులను అర్చకస్వాములు ఆలయ మంటపంలో అధిష్టింపజేశారు. నవ కలశాలలోని జలాలను వేదమంత్రాలతో పవిత్రం చేసి పుణ్యాహవచనంతో ఆలయ పరిసరాల సంప్రోక్షణ నిర్వహించారు. పాంచరాత్రాగమ విధానంలో విశ్వక్సేనునికి తొలిపూజ నిర్వహించి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు.