భార్య సుఖం.. భర్త చావు..
posted on Jun 18, 2021 @ 9:53AM
ఆడవాళ్ళ కోసం యుద్దాలు జరిగాయి. రాజ్యాలు తగలబడ్డాయి. రాజులు మరణించారు ఇదంతా ఎందుకోసం చెపుతున్నాను అంటే.. ఇన్ని రోజులు సాపకింది నీరులా భర్తకు తెలియకుండా.. భార్య, భార్యకు తెలియకుండా భర్త నడిపిన అక్రమ సంబంధాలు అని లాక్ డౌన్ కారణంగా వెలుగులోకి వస్తున్నాయని చెప్పాలి. ఇంకేముంది ఆ అక్రమ సంబంధాలు ఇంట్లో తెలియడంతో ముందుగా మందలింపులు, ఆ తర్వాత గొడవలు, మితిమీరితే ఒకరినొకరు చంపుకోవడం.తాజాగా తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడన్న కోపంతో ఓ మహిళ తన భర్తనే హత్య చేసింది. ఆ తర్వాత డెడ్‌బాడీ రంగు మారడంతో ఆ మాయలాడి చేసిన నిర్వాహకం బయటపడింది.
తన సుఖానికి సినిమాకు ముందు వేసే ముకేశ్ యాడ్ లా అడ్డుగా ఉన్నాడని. మూడు ముళ్ళు , ఏడు అడుగులు వేసిన భర్తనే కడతేర్చిందో మహిళ. ఈ ఘటన ప్రకాశం జిల్లా జె.పంగులూరు మండలం తూర్పు కొప్పెరపాడులో ఆలస్యంగా వెలుగు చూసింది. అతని పేరు కుంచాల రవి వయసు 35 సంవత్సరాలు. అదే గ్రామానికి చెందిన రాజ్యలక్ష్మితో 12 సంవత్సరాల క్రితం పెళ్లి జరిగింది. రవి బేల్దారీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రాజ్యలక్ష్మి ఇంట్లో ఖాళీగా ఉంటుంది. అలా ఖాళీగా ఉండడం ఎందుకు అనుకుందో లేదా.. భర్త తనకు సుఖం ఇవ్వడం లేదు అనుకుందో ఏమో గానీ. తన ఇంటికి సమీపంలో ఉండే ఓ వ్యక్తితో కొన్నాళ్లుగా యవ్వారం నడిపింది. ఈ విషయాన్ని గమనించిన రవి, రాజ్యలక్ష్మి ని మందలించాడు. పద్ధతిగా ఉండాలని భార్యను హెచ్చరించాడు. ఆమె భర్త మాటలు లెక్క చేయలేదు. ఆ తర్వాత కూడా ప్రియుడితో విరహం తీర్చుకునేది. ఎంత చెప్పిన ఆమెలో మార్పు రాకపోవడంతో దంపతుల మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే తన సుఖానికి అడ్డొస్తున్న భర్తను అడ్డు తొలగించుకోవాలని రాజ్యలక్ష్మి నిర్ణయించుకుంది. అందుకు ఎవరికి అంతుచిక్కని పథకం వేసింది. ఆ పధకాన్ని అమలు చేయడానికి సరైన సమయం కోసం వెయిట్ చేస్తుంది. ఆమె అనుకున్న రోజు రానే వచ్చింది. మంగళవారం రాత్రి మద్యం తాగి ఇంటికొచ్చిన రవికి కూల్‌డ్రింక్‌లో విషం కలిపి తాగించగా కొద్దిసేపటికే అతడు చనిపోయాడు. దీంతో కొత్త నాటకానికి తెరదీసిన ఆమె తన భర్త నిద్రలోనే చనిపోయాడంటూ బంధువులకు ఫోన్ చేసి చెప్పింది. దూర ప్రాంతంలో ఉన్న బంధువులు గురువారం చేరుకోవడంతో అప్పటివరకు అంత్యక్రియుల జరపకుండా ఆపారు. అయితే రవి మృతదేహం రంగుమారి ఉండడంతో అనుమానం వచ్చిన వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని రాజ్యలక్ష్మిని నిలదీయగా అసలు విషయం చెప్పింది. దీంతో వారు రవి డెడ్‌బాడీని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. రాజ్యలక్ష్మిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ హత్యోదంతంలో ఆమె ప్రియుడు ప్రమేయం ఉందా? అన్న కోణంలోనూ విచారిస్తున్నారు.