రోజు కలలో మాంత్రికుడు అత్యాచారం చేస్తున్నాడని మహిళా కేసు..
posted on Jun 24, 2021 @ 5:56PM
నా నీడ పోయిందని ఆ మధ్య కాలంలో ఓ సినిమా వచ్చింది. ఆ సినిమా పేరు నెపోలియన్. అయితే తాజాగా ఒక వ్యక్తి నిత్యం ఓ వ్యక్తి అత్యాచారం చేస్తున్నాడంటూ ఓ మహిళా కేసు పెట్టింది. ఇందులో వింతేముంది అని మీరు అనుకుంటున్నారా? ఆ నిజమెంతో మీరే చూడండి. అత్యాచారం అంటే అలాంటిలాంటి అత్యాచారం కాదండి బబ్బోయ్ని.. ఆమెను రోజు ఒక మాంత్రికుడు రాత్రిళ్లు కల్లోకి వచ్చి తనపై అత్యాచారం చేస్తున్నాడంటూ ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వింత సంఘటన బిహార్‌లోని ఔరంగాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.
ఇంతకీ ఆమె ఎందుకు? ఎలా ? కనెక్ట్ అయిందో మీరే చూడండి. అయితే బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో.. ఔరంగాబాద్ జిల్లా, కుద్వ పోలీస్ స్టేషన్ పరిథిలోని గాంధీ మైదాన్ ప్రాంతంలో నివాసం ఉంటుంది ఓ మహిళ. అయితే కొంతకాలంగా తన కుమారుడికి అనారోగ్యంగా ఉండటంతో ఆమె గత జనవరి నెలలో ప్రశాంత్ చతుర్వేది అనే మాంత్రికుడిని ఆశ్రయించింది. భారతీయులం కదా సైన్సు కంటే మాత్రలను మాంత్రికులను నమ్ముకుంటాం.? ఆ మాంత్రికుడు మహిళ కుమారుడి అరోగ్యం కోసం కొన్ని పూజలు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఇదే క్రమంలో 15 రోజుల తర్వాత ఆమె కొడుకు చనిపోయాడు. కుమారుడి మరణం తర్వాత ఆమె ప్రశాంత్ ఉంటున్న కాళీ బరి ఆలయానికి వెళ్లింది. తన కుమారుడు ఎందుకు మరణించాడో చెప్పాలని నిలదీసింది. ఈ నేపథ్యంలో అతడు ఆమెపై అత్యాచారం చేయబోగా.. చనిపోయిన ఆమె కుమారుడు అడ్డుకున్నాడని ఓ మహిళ తెలిపింది. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ మొదలు పెట్టారు. ప్రశాంత్‌ను విచారించగా ఆమె చెప్పేదంతా అబద్ధమని కొట్టిపాడేశాడు. ఆమెను ఎప్పుడూ కలుసుకోలేదని విచారణలో వెల్లడించాడు. నిందితుడికి వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లభించకపోవటంతో పోలీసులు.