కోరిక తీర్చమన్న భర్త.. చంపేసిన భార్య..
posted on Jun 7, 2021 @ 4:50PM
పెళ్ళాం మొగుడు అన్నంక కొంచం ముద్దు ముచ్చట ఉండాలి, సరసం, విరసం..విసుకోవడాలు, విన్న వించుకోవడాలు ఉండలు ఉంటాయి. అన్ని కలిస్తేనే సంసారం అంటారు. ధర్మ, అర్థ, కామ, మోక్షములలో తోడుగా ఉంటానని పంచభూతాలుగా సాక్షిగా ప్రతిజ్ఞ చేసిన సతి చివరికి భర్త చావుకు కారణం అయింది. భర్తతో కలిసి జీవితాన్ని పంచుకోవాల్సిన భార్య.. అతడి పాలిట యమపాశంగా మారింది. ఇంతకీ ఏం జరిగింది.. ఎలా జరిగింది అనేది చూద్దాం..
కామారెడ్డి పట్టణంలోని బీడీ వర్కర్స్ కాలనిలో ప్రవీణ్ (38), లావణ్య దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. మెట్ పల్లి శివారులో బీడీ కార్ఖానాలకు ఇంఛార్జిగా ప్రవీణ్ పని చేస్తున్నాడు. అతనికి ఇద్దరు బావమరుదులు ఉన్నారు. ఈ మైదా కాలంలో వారు కొంత భూమి విక్రయించగా కొంత డబ్బు వచ్చింది.. బావ బావమరుదులు అన్నాకా ఇచ్చి పుచ్చుకోవడం సహజం.. అది పక్కన పెడితే సహాయం అడిగిన బావ కి తమకు తోచిన సహాయం అందించడం బామ్మర్దుల దర్మం.. అలా భూమి విక్రయించగా వచ్చిన డబ్బులలో తన అవసరానికి కొంత తేవాలని భార్యకు సూచించాడు అతడు.. అంతే అదే ఆయన చేసిన పాపమైంది. భర్త అడిగిన విషయమై ఆమె అన్నదమ్ములైన రమేష్, శ్రీను, లక్ష్మణ్ ల వద్ద ప్రస్తావించింది. భర్తకు డబ్బులు ఇవ్వడం ఇష్టంలేని భార్య తన అన్నదమ్ములతో కలిసి భర్తను హత్యచేయడానికి ప్లాన్ వేసింది. ఇక అందుకు అన్ని సిద్ధం చేశారు.
అది సోమవారం ఉదయం కామారెడ్డికి వచ్చిన ముగ్గురు బామ్మర్దులు, వారి భార్యలు, ప్రవీణ్ భార్య కలిసి ప్రవీణ్ పై ఇటుకలు, కర్రలతో దారుణంగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో తీవ్ర గాయాలైన ప్రవీణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న దేవునిపల్లి రూరల్ సిఐ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్సై రవికుమార్ కాలానికి వచ్చి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాలనిలో అందరితో కలుపుగోలుగా ఉండే ప్రవీణ్ హత్యకు గురికావడం కాలనిలో విషాదాన్ని నింపింది.