భార్యకు కరోనా.. బాత్ రూంలో బంధించిన భర్త..
posted on Jun 4, 2021 @ 5:39PM
కరోనా ఏంటో మందిని అనాథలను చేసింది. ఎన్నో కుటుంబాలను కన్నీటి పర్వంలో ముంచింది. దాదాపు అందరిని ఆర్థికంగా కుదిపేసింది. మరికొందరిలో మానవత్వాన్ని కూడా చంపేసింది. బంధువులను బంధుత్వాన్ని దూరం చేసింది. కరోనా వల్ల మనిషిలో మానవత్వం నశించిపోయి చనిపోయిన శవం తో ఒకడు వాడి కోరిక తీర్చుకుంటే, ఆ పేషేంట్స్ మేడలో ఉన్న బంగారాన్ని దొంగిలించాడు మరొకడు. అత్తకు కరోనా వచ్చిందని తాను చనిపోతే కోడలు హాయిగా ఉంటుందని కోడలికి కరోనా అంటించిన అత్తని చూశాం.. తాజాగా అలాంటిదే ఇంకో సంఘటన వెలుగులోకి వచ్చింది. అదేంటో తెలుసుకుందాం..?
అది మంచిర్యాల జిల్లా. ఒక వ్యక్తి అమానుషంగా ప్రవర్తించాడు. తన భార్య కరోనా సోకిందని ఆమెను ఏకంగా బాత్రూంలో బంధించాడు. తెలియని తనమో, లేక కరోనా తనకు కూడా సోకుందనే భయమో తెలీదు గానీ తన భార్యను స్నానాల గది నుంచి రానివ్వకుండా చేశాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలోని లక్సెట్టి పేట పట్టణంలో చోటు చేసుకుంది. అయితే, ఆమె గత ఏడు రోజులుగా బాత్రూంలో ఉంటున్నట్లుగా స్థానికులు చెప్పారు. బాత్రూంలోనే ఉంటూ ఆమె నరకయాతన అనుభవించింది. తన భర్త తనకు అన్నం, నీళ్లు కూడా ఇవ్వలేదని రోదించింది.
ఏదో విధంగా ఆమె బాధ స్థానికులకు తెలిసింది. దీంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెంటనే ఆమె ఇంటికి వెళ్లి బాత్రూంలో ఉన్న ఆమెను బయటకు తీసుకొచ్చి ఓ గదిలో హోమ్ ఐసోలేషన్‌లో ఉంచారు. ఆమె భర్తకు కౌన్సిలింగ్ ఇచ్చారు.
కరోనా వస్తే హాస్పిటల్ కి తీసుకెళ్లే భర్తని చూశాం గాని మరి ఇంత దారుణంగా ప్రవర్తించే భర్తలు కూడా ఉంటారని చెలిసింది.. ఈ ఘటన పబ్లిక్ అయింది కాబట్టి తెలిసింది. ఇంకా ఇలాంటి ఘటనలు చీకటి చాటున ఎన్ని ఉన్నాయో.. ఏది ఏమైనా కరోనా టైం లో ఫ్యామిలి వాళ్లకు ధైర్యాన్ని ఇవ్వాలేగాని.. ఇలా వ్యాదికంటే ముందే మనం చంపొద్దు.. ఏదేమైనా కరోనా చాలా గుణపాఠాలు నేర్పిందనే చెప్పాలి.. అందులో ముఖ్య మన వాళ్ళు ఎవరో.. మన మేలు కోరేవాళ్ళు ఎవరో.. ఎవరు నటిస్తున్నారో.. ఎవరు జీవిస్తున్నారో ఎవరు బంధువులో ఎవరు బద్మాష్ గాల్లో అందరికి తెలిసివచ్చింది.