నవరొచ్చు చానల్.. యూ ట్యూబ్ చానల్స్ కు నీతులా?
posted on Oct 26, 2021 @ 5:53PM
చెప్పచ్చు ... తప్పులు జరిగినప్పుడు ఎత్తి చూపోచ్చు ... దాన్ని ఎవరూ తప్పు పట్టరు. కానీ, ఎవరో ఒకరు చేసిన తప్పుకు అందరినీ అదే గాటన కట్టేయడమే ఓ అడ్డగోలు వ్యవహారం అయితే, అలాంటి తప్పులు వందల్లోనో ఇంకా ఎక్కువో చేసిన ఓ పెద్ద ముత్తైదువ తగుదునమ్మాఅని ఎగరేసుకుని ... యూ ట్యూబ్ చానల్స్ కు నీతులు చెప్పడం, సిగ్గుచేటు... ఇంకా చెప్పాలంటే ...ఛీ... థూ .. యాక్ అని కూడా అనవచ్చును.
ఈ మధ్య కాలంలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ’మా’ ఎన్నికల సందర్భంగా సినిమా వాళ్ళు వాళ్ళలో వాళ్ళు గొడవలు పడి బజారున పడ్డారు. నాలుగు గోడల మధ్య గుట్టుగా చక్కదిద్దుకోవలసిన వలసిన ‘మా’ కుటుంబ కలహాలను, వాళ్ళే బజారున పడేసుకున్నారు. సినిమా అన్నా,సినిమా వాళ్లాన్నా తెలుగోడికి ఉండే ప్రత్యేక క్రేజ్, ఇంటరెస్ట్ అందరికీ తెలిసిందే ..సో.. సహజంగానే మీడియా అటుకేసి ఫోకస్ పెట్టింది. అలాగే అదే సమయంలో హీరోయిన్ సమంత, హీరో నాగచైతన్యల విడాకుల వ్యవహారం కూడా రోడ్డెక్కింది. సెలబ్రిటీలు అయినా లేక సామాన్యులే అయినా వారి వారి సంసారం వ్యవహారాలు ... వారి వారి సొంతం ..కానీ, ఒక సారి గడప దాటితే ఇక అంతే .. అదే సెలెబ్రిటీల విషయం అయితే ఇక చెప్పనే అక్కర్లేదు. అందుకే శ్రీ శ్రీ అంతటి మహాకవే ... పబ్లిక్’లో నిలబడితే ..ఏమైనా అంటాం..అని గట్టి వార్నింగ్ ఇచ్చారు. అలాగని సెలెబ్రిటీల సొంత వ్యవహరాల్లోకి దూరి పోమని కాదు.
ఈ నేపధ్యంలో కొన్ని కొన్ని యూ ట్యూబ్ ఛానల్స్, గీత దాటితే దాటుండ వచ్చును. ఆమాటకొస్తే, యూ ట్యూబ్ ఛానల్స్ మాత్రమే కాదు, తొమ్మిది నోములు చేసిన ఆ పరమ పవిత్ర పత్తిత్తు చానల్ సహా అన్ని చానల్స్, చివరకు పత్రికలు కూడా, అదుపు తప్పి అడ్డగోలు రాతలు రాసాయి ... చర్చలు పెట్టాయి .. రచ్చ చేశాయి. అయితే, ఇప్పుడు ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు యూ ట్యూబ్ ఛానల్స్’ పై ఎదో విమర్శ చేశారని, సమంత ఇకవరిపైనో కేసు పెట్టారని, ఇంకెవరో ఎదో అన్నారని, తగుదునమ్మా అని, ఆ నవరొచ్చు చానల్ యూ ట్యూబ్ చానల్స్’ నీతులు బోధించడం గురువింద నీతిని గుప్పుమనిపిస్తోంది.
యూ ట్యూబ్ చానల్స్’పై ఏ ఏ కేసులు పెట్టొచ్చో, నవరొచ్చు యాక్’రమ్మలు వంతుల వారీగా వివరించారు. వ్యూస్ కోసం రోత రాతలనీ, రాతలపై వాతలనీ, అన్నీ రొచ్చుగుంట చానల్’ కు వర్తించే సూక్తులే వల్లే వేశారు. ఒకవేలు ఎదుటివారిపి చూపేటప్పుడు నలుగు వెళ్ళు తమ వైపు చుపుతాయనే ఇంకిత జ్ఞానం లేనప్పుడు ఇదిగో ఇలాంటి పిచ్చి కూతలు , రొచ్చుగుంట చర్చలే వస్తాయి. అదే సమయంలో గురువింద 9’ తనని తాను తిరగేసి చూసుకుంటే,కింద నల్లని అరే (6) కాదు, అంతకు ఆరేడు రెట్లు ఎక్కువ కేసులు కనిపిస్థాయి. ఒక్క డిఫేమేషన్ కేసులు మాత్రమే కాదు, ఇంకా ఫోర్జరీ సహా చాలా చాలా ఇతర కేసులు కూడా ఎన్నో ఉన్నాయి. వార్తలు రాతలకు సంబదించిన కేసులే కాదు. బ్లాకు మెయిల్ కేసులు, ఇంకా నీచమైన కేసులు కూడా ఉన్నాయి.
ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి సంబదించి,గౌరవ శాసన సభ్యులను అవమాన పరిచే విధంగ పోగ్రాం చేసిన ఆ చానల్ సీఈఓ అరెస్ట్ అయ్యారు. అంతే కాదు, టీవీ చానల్ ఆఫీస్ లో పోలీసులు తనిఖీలు చేశారు, అరెస్టులు జరిగాయి. టీఆర్పీ రేటింగ్స్ కోసం తప్పుడు వార్తలు ప్రసారం చేయడం, సంచలనం కోసం రెచ్చగొట్టే విధంగా సమాజంలో చిచ్చుపెట్టే చర్చలకు సంబంధించి ఇంకెన్ని కేసులున్నాయో ఏమో కానీ, కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు సమయంలో తెచ్చిన నోట్లలో చిప్ పెట్టిందని, ఆ నోటు మన దగ్గర ఉంటే , మనం ఎక్కడుంది, మీరేం చేస్తోంది అంతా ప్రభుత్వానికి తెలిసి పోతుందని, తప్పుడు ప్రచారం చేసింది మాత్రం అందరికీ తెలిసిన నిజం.
నిజానికి, ఈ గురువింద 9 చానల్ చరిత్ర అంతా తొమ్మది నేరాలు తొమ్మది తొమ్ముదుల ఘోరాలు. అలాంటి, నీచ చానల్ కు యూ ట్యూబ్ చానల్స్ అన్నిటికి ఫ్రాడ్ ముద్ర వేసి బదనాం చేసే హక్కు ఎవరిచ్చారు .. నిజానికి ఈ ప్రోగ్రాం ప్రసారం చేసినందుకు ఎవరైనా డిఫెమేషన్ కేసు వేయవచ్చునేమో ...