కరోనా వ్యాక్సిన్ వస్తుందా? రాదంటున్న WHO శాస్త్రవేత్త!
posted on May 6, 2020 @ 12:06PM
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)లోని కరోనా ఎనలిస్ట్ డేవిడ్ నబారో మాత్రం కరోనా వైరస్‌కి ఇప్పుడే కాదు, మరెప్పటికీ వ్యాక్సిన్ రాకపోవచ్చు అని విశ్లేషిస్తున్నారు. ప్రపంచంలో ఎయిడ్స్, డెంగ్యూ, సార్స్ లాంటి వైరస్‌లకు ఇప్పట్టి వరకు వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు.
ఎయిడ్స్, డెంగ్యూ లాంటి వాటికి ఎన్ని ప్రయోగాలు చేసినా ఆ వైరస్‌కి చెక్ పెట్టలేకపోతున్నారు శాస్త్రవేత్తలు. ఇక సార్స్ వచ్చినప్పుడు వ్యాక్సిన్ల ప్రయోగాలు చేపట్టినా, అది దానంతట అదే తగ్గడంతో ప్రయోగాల్ని తొలిదశలోనే ఆపేశారు.
ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ దాదాపు సార్స్ వైరస్‌కి దగ్గర పోలికలతో ఉంది. అందువల్ల సార్స్‌కి వ్యాక్సిన్ కనిపెట్టి ఉంటే, అది కరోనాకీ చెక్ పెట్టి ఉండేదే. ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా అంత త్వరగా లొంగేలా కనిపించట్లేదు. అందుకే డేవిడ్ నబారో ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. డేవిడ్ నబారో నిరాశతో ఉన్నారు.
మనుషులపై వ్యాక్సిన్ ప్రయోగాల్లో చాలా దశలుంటాయి. మొదటి దశలో వ్యాక్సిన్ ఇస్తే... అది ఆ మనిషికి ఏదైనా ప్రమాదకరమా అన్నది చూస్తారు. ఆ తర్వాత... ఆ వ్యాక్సిన్ వైరస్‌ని చంపుతుందా లేదా అన్నది చూస్తారు. ఆ తర్వాత వ్యాక్సిన్ వల్ల మనిషికి దీర్ఘకాలిక సమస్యలేమైనా వస్తాయా అన్నది చూస్తారు. అలాగే వ్యాక్సిన్ ఇస్తే, ఆ వ్యక్తికి ఆల్రెడీ ఉన్న జబ్బులపై ఎలాంటి ప్రభావం ఉంది అన్నది చూస్తారు. అలాగే వ్యాక్సిన్ ఏ వయసు వారిపై ఎలా పనిచేస్తోంది అన్నది చూస్తారు. ఇలా చాలా లెక్కలుంటాయి. వీటిలో ఏ ఒక్కటి సెట్ కాకపోయినా ఆ వ్యాక్సిన్ తయారీ ఆపేస్తారు. అందుకే డేవిడ్ నబారో కరోనా వ్యాక్సిన్ తయారీ అంత తేలిక కాదంటున్నారు.
కరోనా, సార్స్, స్వైన్‌ఫ్లూ, క్షయ ఇవన్నీ శ్వాసకోశ సంబంధ అంటు వ్యాధులే. అయితే కరోనా, సార్స్, స్వైన్‌ఫ్లూ, ఉప్పె నలా విరుచుకుపడతాయి. క్షయను మాత్రం సైలెంట్ కిల్లర్ నిశ్శబ్ధ హంతకిగా చెబు తారు. ఎయిడ్స్ తర్కాత ఎక్కువ మందిని బలిగొఒంటున్న అంటు వ్యాధి ఈ క్షయ. ఎయిడ్స్ వల్ల ఏటా 3.2 కోట్ల మంది చనిపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా గత సంవత్సరం 94 లక్షల మంది దీని టిబి బారిన పడగా 17 లక్షల మంది మరణించారు. క్షయ వ్యాధి ఒక్క భారత్‌లోనే ఏటా 5 లక్షల మందిని కబళిస్తోంది. అలాగే ఏటా 4 లక్షల మందికి డెంగ్యూ సోకుతోంది. కనీసం డెంగ్యూకి వ్యాక్సిన్ తయారయ్యేలా చాలాసార్లు కనిపించినా ఫెయిలవుతూనే వుంది.
అయితే వాస్తవ పరిస్థితులు ఇలా వుంటే, ఆగస్ట్ కల్లా కరోనా వ్యాక్సిన్ తయారవుతుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ లాంటి వాళ్లు కూడా చెబుతున్నారు. నిజంగానే కరోనా వ్యాక్సిన్ వస్తుందా? లేక మెడికల్ మాఫియా కొత్త నాటకానికి తెరలేపుతుందా? ఏదైనా జరగవచ్చు.