ఎవరా ఓవర్ యాక్షన్ ఎమ్మెల్యేలు?
posted on Aug 28, 2024 @ 8:38PM
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. కొంతమంది ఎమ్మెల్యేల బాధ్యతారాహిత్యమైన ప్రవర్తన వల్ల ఇన్నాళ్ళుగా తెచ్చుకున్న మంచిపేరు పాడవుతోందని మంత్రుల దగ్గర ముఖ్యమంత్రి అన్నట్టు సమాచారం. సదరు ఎమ్మెల్యేలు చేస్తున్న పొరపాట్లు మీడియాలో పుంఖాను పుంఖాలుగా వస్తున్నాయంటూ చంద్రబాబు అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. కొంతమంది చేసే పనుల వల్ల అందరికీ ఇబ్బంది కలుగుతోందని చంద్రబాబు విచారం వ్యక్తం చేశారని సమాచారం. ఇకపై మంత్రులు కూడా జాగ్రత్తగా ఉండాలని, తమ జిల్లాల్లోని ఎమ్మెల్యేలు, నాయకులకు దిశానిర్దేశం చేయాలని సూచించిన చంద్రబాబు ఇకపై ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మంత్రులు, ఎమ్మెల్యేలదేనని అన్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వంలో రహస్యంగా వుంచాల్సిన విషయాలు బయటకి పోతున్నాయని, శ్వేత పత్రాల్లో సమాచారం, ఓటాన్ అకౌంట్ వివరాలు, ఇతర కీలకమైన నిర్ణయాలు బయటకు పొక్కడం పట్ల చంద్రబాబు విస్మయం వ్యక్తం చేశారని తెలుస్తోంది. ప్రభుత్వ శాఖల్లో వైసీపీ గూఢచారులు ఉన్నారన్న అంశం కేబినెట్ భేటీలో విస్తృతంగా చర్చించారు.